Movie News

సత్యకు ప్రశంసలు… త్రివిక్రమ్ కు తిట్లు

కొన్ని సినిమాలు థియేటర్లలో ఎలా ఆడినా సరే ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పుడు ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తారు. అలాంటి చిత్రమే ఆదర్శ కుటుంబం. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాను థియేటర్లో చూడలేకపోయినా, ఓటిటిలో చూద్దామని చాలామంది ఎదురు చూశారు.

వారి నిరీక్షణకు తెరదించుతూ నెట్ ఫ్లిక్స్ నిన్న రాత్రి నుంచే ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో వెంటనే సోషల్ మీడియాలో ఆదర్శ కుటుంబం ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అనుకున్నట్లే ఈ సినిమాకు డిజిటల్ రిలీజ్ లోను మిశ్రమ స్పందన తప్పలేదు. కొందరు కామెడీ పర్లేదు అంటున్నారు కానీ.. సినిమాను ఎక్కువమంది కొంచెం ఘాటుగానే విమర్శిస్తున్నారు.

ఆదర్శ కుటుంబంలో ఎక్కువ మంది మెచ్చుకుంటున్నది, ప్రశంసల జల్లు కురిపిస్తున్నది సత్య కామెడీ విషయంలోనే. పోలీస్ స్టేషన్ ఇంటరాగేషన్ సీన్ సహా కొన్ని సన్నివేశాల్లో సత్య హావభావాలు, నటన కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తోందని నెటిజెన్లు కొనియాడుతున్నారు. ఆయా సన్నివేశాలు తాలూకు వీడియోలు పెట్టి సత్య మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతంతమాత్రంగా ఉన్న సినిమాను నిలబెట్టింది సత్యనే అని తీర్మానిస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద తీవ్ర విమర్శలు కురుస్తున్నాయి.

అసలు వెంకటేష్ హీరోగా పెట్టి ఇలాంటి కథతో సినిమా తీస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత బేసిక్ రైటింగ్ తో ఎలా హిట్ కొడదామని త్రివిక్రమ్ అనుకున్నారో అని ఆశ్చర్యపోతున్నారు. కథ మరి ఇల్లాజికల్ గా ఉందని.. ఎమోషన్ అసలు వర్కౌట్ కాలేదని విమర్శిస్తున్నారు. ఇంత టైం తీసుకుని తీసింది ఈ సినిమానా అని ఎద్దేవా చేస్తున్నారు. బ్లాస్ట్ మూవీతో పోలిక పెట్టి ఈ సినిమాపై గట్టిగానే పంచులు వేస్తున్నారు నెటిజన్లు.

This post was last modified on November 28, 2026 8:56 pm

Share

Recent Posts

రా.వన్ సినిమా సీన్ రిపీట్ అవుతుందా?

ఈ రోజుల్లో ఏ చిన్న సమాచారం కావాలన్నా ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయించడం సాధారణమైపోయింది. చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యక్తిగత పనులు..…

3 hours ago

అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి

కొందరు దర్శకులు అరంగేట్రంలో అదరగొట్టి తర్వాత నిరాశ పరుస్తుంటారు. కొందరేమో తొలి సినిమాతో నిరాశపరిచినప్పటికీ, తర్వాత పుంజుకుని ఆశ్చర్యపరిచే సినిమా…

5 hours ago

ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత

ఇకపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడాలంటే చేతిలో ఫోన్ పట్టుకుని గంటల తరబడి స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంట్లోని…

6 hours ago

21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ల మధ్య రాజకీయ విభేదాలున్న సంగతి తెలిసిందే. గతంలో…

7 hours ago

మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ దాదాపు కేంద్ర‌ప్ర‌భుత్వానికి అనుకూలంగా మారుతోంది. గ‌త నాలుగు రోజులుగా కేంద్రంలో జ‌రుగుతున్న…

7 hours ago

బిల్లు పాస్ అయ్యాక మహిళలదే హవా

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆంధ్ర ప్రదేశ్ మహిళా నాయకుల్లో సందడి వాతావరణం నెలకొంది. మహిళా రిజర్వేషన్…

7 hours ago