Political News

మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ దాదాపు కేంద్ర‌ప్ర‌భుత్వానికి అనుకూలంగా మారుతోంది. గ‌త నాలుగు రోజులుగా కేంద్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌భ‌వంటి విష‌యాల‌పై అనధికారిక మీడియాలో సానుకూల క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నకు కూడా మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నార‌ని బీఆర్ఎస్ నాయ‌కులు చెబుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో.. పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాలు కూడా 50 శాతం వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి. త‌ద్వారా తెలంగాణ‌లో కొత్త నేత‌ల‌కు, అదేవిధంగా బ‌డుగుల‌కు కూడా రాజ‌కీయంగా అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయ‌ని చెబుతున్నారు. ఇది తెలంగాణ అస్తిత్వానికి, భ‌విష్య‌త్తుకు కూడా మంచి ప‌రిణామ‌మ‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ కూడా క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్.. డీలిమిటేష‌న్‌కు దాదాపు జైకొట్టేసింద‌ని చెబుతున్నారు.

మ‌రి సీఎం రేవంత్ మాటేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. పార్టీ ప‌రంగా చూస్తే.. కాంగ్రెస్ జాతీయ‌స్థాయిలో డీలిమిటేషన్‌ను  ఇప్ప‌టికీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌తిపాదించిన బిల్లులో మార్పులు కూడా రాజ్యాంగ స్వ‌రూపాన్ని మార్చే ఉద్దేశంతోనే మోడీ, అమిత్‌షాలు తీసుకువ‌స్తున్నార‌ని ఇప్ప‌టికే వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నాయ‌కులు దీనిని తాము ఒప్పుకొనేది లేద‌ని తేల్చి చెబుతున్నారు. వాస్త‌వానికి మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు 2023లో ఆమోదించార‌ని.. దానిని య‌ధాత‌థంగా అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు.

ఇక‌, డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌ను 50 శాతం వ‌ర‌కు పెంచ‌డం ద్వారా అమలు చేయాల‌ని.. దీనిని బిల్లులో పేర్కొనాల‌ని కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత స‌వ‌ర‌ణ ప్ర‌తిపాద‌న విష‌యంలోనూ ముందుకు వెళ్లే విష‌యం పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఈ పరిణామం రేవంత్ రెడ్డిపైనా ఉంటుంది. వ్య‌క్తిగ‌తంగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఈ విష‌యంలో ఆయ‌న‌కు లేదు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్‌కు క‌లిసి వ‌స్తున్న అంశంగా మారింది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, స‌హా పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల పెంపున‌కు రేవంత్ రెడ్డి అడ్డుప‌డ‌నున్నార‌ని.. ప్ర‌చారం చేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మున్ముందు ఇది ఎలాంటి రాజ‌కీయ స‌మ‌రంగా మారుతుందో చూడాలి.

This post was last modified on November 28, 2026 11:23 pm

Share

Recent Posts

అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి

కొందరు దర్శకులు అరంగేట్రంలో అదరగొట్టి తర్వాత నిరాశ పరుస్తుంటారు. కొందరేమో తొలి సినిమాతో నిరాశపరిచినప్పటికీ, తర్వాత పుంజుకుని ఆశ్చర్యపరిచే సినిమా…

48 minutes ago

ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత

ఇకపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడాలంటే చేతిలో ఫోన్ పట్టుకుని గంటల తరబడి స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంట్లోని…

2 hours ago

21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ల మధ్య రాజకీయ విభేదాలున్న సంగతి తెలిసిందే. గతంలో…

3 hours ago

బిల్లు పాస్ అయ్యాక మహిళలదే హవా

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆంధ్ర ప్రదేశ్ మహిళా నాయకుల్లో సందడి వాతావరణం నెలకొంది. మహిళా రిజర్వేషన్…

3 hours ago

సత్యకు ప్రశంసలు… త్రివిక్రమ్ కు తిట్లు

కొన్ని సినిమాలు థియేటర్లలో ఎలా ఆడినా సరే ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పుడు ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తారు. అలాంటి చిత్రమే ఆదర్శ…

3 hours ago

రాహుల్ గాంధీ చెప్పే సరిహద్దుల మార్పు వాదన

డీ లిమిటేషన్ బిల్లుతో దేశంలో ప్రజా స్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్‌సభ…

4 hours ago