Movie News

మాట నిలబెట్టుకోవడానికి కింగ్ పరుగులు

లెనిన్ నుంచి ఇట్లు అర్జున దాకా నాగార్జున పలు సందర్భాల్లో టాలీవుడ్ దర్శక నిర్మాతలు పనులు వేగవంతం చేసుకోవడం గురించి సలహాలు, సూచనలు ఇస్తూనే ఉన్నారు. కనీసం రెండు నెలల ముందు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునే పద్దతి టాలీవుడ్ లో రావాలని, అప్పుడే మెరుగైన నాణ్యతతో ఆడియన్స్ కి మంచి సినిమాలు ఇవ్వడం సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు. ఆయన చెప్పింది చాలా మంచి విషయం కావడంతో ఇండస్ట్రీ నుంచి కౌంటర్ రాలేదు. పైపెచ్చు సమర్ధించినవాళ్లే ఎక్కువ.

వచ్చే నెల కింగ్ 100 విడుదల కానుంది. ఇప్పటిదాకా వచ్చింది కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే. అందులో కూడా రెండు మూడు ఏఐ షాట్స్ ఉన్నాయనే కామెంట్స్ నాగ్ దృష్టికి వెళ్లాయి. సో మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిలీజ్ కు కేవలం 37 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ఒక సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. కాంపిటీషన్ లో ఉన్న బాలకృష్ణ దాదా నుంచి ఒక పాట, షారుఖ్ ఖాన్ కింగ్ నుంచి ఒక సాంగ్ వచ్చాయి. ఫీడ్ బ్యాక్స్ పక్కనపెడితే ట్రెండ్ అయితే అయ్యాయి.

ఇంకోవైపు వీటికి వారం ముందు వస్తున్న అవెంజర్స్ డూమ్స్‌డే అప్పుడే టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కింగ్ 100 మాట తప్పకుండా ఉండేందుకు పరుగులు పెడుతోంది. ఇటీవలే నాగార్జున చెప్పిన దాని ప్రకారం ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్, ఒక పాట షూట్ పెండింగ్ ఉన్నాయి. మరి ఎందుకు ప్లాన్ చేసుకుని పూర్తి చేయడం లేదో అంతు చిక్కడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బిగ్ బాస్, మెగావర్స్, ఇతర ఈవెంట్స్ అంటూ నాగ్ క్రమం తప్పకుండ బయట కనిపిస్తూనే ఉన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో కింగ్ 100 వాయిదా లేకుండా చూడాలనేది నాగార్జున పట్టుదల. అసలే స్వంత బ్యానర్. సమర్ధించుకోవడానికి కూడా లేదు. అందరికీ చెప్పి మనం ఫాలో కాకపోతే ఎలా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తాయి. ఆర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన కింగ్ 100కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తనేమో ఎల్లమ్మ షూటింగ్ లో బిజీ ఉన్నాడు. కొంచెం వీలు చూసుకుని నాగ్ సినిమా రీ రికార్డింగ్, పాటల పనులు పూర్తి చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

This post was last modified on November 17, 2026 7:26 pm

Share

Recent Posts

అంతా ఎప్పటిలాగే ఉంటుందని చెప్పనన్న నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ లో ఉద్యోగాలపై సీఈవో సత్య నాదెళ్ల కూడా హామీ ఇవ్వలేకపోతున్నారు. భారత్ సహా నాలుగు దేశాల్లో ఉద్యోగులకు కంపెనీ…

9 minutes ago

కామెడీ అంటే క్రింజ్ కాదు క్వాలిటీ

చిన్న వయసులో సక్సెస్ రావడం అంత ఈజీ కాదు. దాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద ఛాలెంజ్. ఇది అందరి వల్లా కాదు.…

1 hour ago

హెల్ప్ చేయండి మేడం… నిర్మలమ్మకు చంద్ర‌బాబు విన‌తి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌తో ఆయ‌న భేటీ అయ్యారు. సుమారు గంట‌న్న‌ర…

2 hours ago

జగన్ సైతాన్ సైన్యానికి పచ్చ రోగం తగ్గలేదు: షర్మిల

తమ ప్రత్యర్థి అయితే చాలు...టార్గెట్ చేయడం, వ్యక్తిత్వహననానికి పాల్పడడం వైసీపీ నేతలకు అలవాటే. నిండు శాసన సభలో అప్పటి ప్రతిపక్ష…

2 hours ago

రామాయణ తెలుగులో ఎంతవరకు కలెక్ట్ చేసింది?

పాన్ ఇండియా స్థాయిలో మంచి టాక్, రివ్యూలు తెచ్చుకున్న సినిమా.. రామాయ‌ణం. రిలీజ్ ముంగిట ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్నందుకుంటుందో…

3 hours ago

నాగవంశీ మాటల వెనుక మర్మమేమిటో

జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ గురించి అభిమానులు, సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతూనే…

4 hours ago