Movie News

తమన్ సంగీతానికి తమనే పోటీ

తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా నిలవనుంది. అదేంటో చూద్దాం. జూలై 10 ‘లెనిన్’ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అఖిల్ కు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో మంచి బజ్ తెచ్చుకున్న ఈ విలేజ్ డ్రామాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సినీ ప్రియులు ప్రత్యేకమైన అంచనాలు పెట్టుకున్నారు.

అదే రోజు జూలై 10 తమన్ కంపోజ్ చేసిన తమిళ మూవీ తెలుగులో ‘హృదయం మురళి’గా డబ్బింగ్ అవుతూ రెండు భాషల్లో సమాంతరంగా రిలీజ్ అవుతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమాలో తమన్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు. హీరో అధర్వ మురళి అయినప్పటికీ తన పక్కనే ఉండే ఒక ముఖ్యమైన క్యారెక్టర్ లో తమన్ కనిపించబోతున్నాడు. 2003 శంకర్ తీసిన బాయ్స్ లో నటించాక మళ్ళీ మేకప్ వేసుకునే అవసరం తమన్ కు పడలేదు. ఇన్నాళ్లకు ఓకే చెప్పాడు.

వీటి బాక్సాఫిస్ ఫలితాల పట్ల రెండు పరిశ్రమలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత అంత క్రౌడ్ పుల్లర్ లెనిన్ కావాలని బయ్యర్లు కోరుకుంటున్నారు. పాజిటివ్ టాక్ వస్తే అదే జరుగుతుంది. ఇక హృదయం మురళి మీద మ్యూజిక్ వల్ల మంచి బజ్ వచ్చింది. రామ్ కామ్ లా కనిపిస్తున్నప్పటికీ మంచి వినోదం మేళవించి దీన్ని తీసినట్టు టాక్ ఉంది. ఇందులో ఫహద్ ఫాసిల్ ఫ్రెండ్ గ్యాంగ్ లో ఒకడిగా నటించడం మరో అట్రాక్షన్.

చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ తమన్ ఇలా మళ్ళీ నటన వైపు మొగ్గు చూపడం విచిత్రమే. ఒకపక్క దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మతో తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్న టైంలో తమన్ ఇలా రీ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడం విశేషం. రెండు హిట్ అయితే మటుకు తమన్ కు యాక్టర్ గా మరిన్ని అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. తన నెక్స్ట్ లిస్టులో ఆదర్శ కుటుంబం ఏకె 47, కొరియన్ కనకరాజు, ఇట్లు అర్జున, సిగ్మా, బాలయ్య 111, మెగాస్టార్ 158, ఓజి 2 ఉన్నాయి.

This post was last modified on July 4, 2026 6:13 am

Share

Recent Posts

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

56 minutes ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

2 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

2 hours ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

3 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

4 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

4 hours ago