మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాలపై సీఈవో సత్య నాదెళ్ల కూడా హామీ ఇవ్వలేకపోతున్నారు. భారత్ సహా నాలుగు దేశాల్లో ఉద్యోగులకు కంపెనీ స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలే అవకాశం కల్పించింది. ఈ సమయంలో ఓ ఇంటర్వ్యూలో నాదెళ్ల చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆందోళన పెంచేలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో టీమ్‌ల నెంబర్, పని చేసే విధానం మారుతాయని చెప్పారు. అంతా ఎప్పటిలాగే ఉంటుందని చెప్పాలనుకున్నా, అలా చెప్పలేనని అన్నారు.
అమెరికా, భారత్, బ్రిటన్, కెనడాలోని కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఈ ఆఫర్ ప్రకటించింది. దీన్ని వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్‌గా పిలుస్తున్నారు. అంటే అర్హులైన ఉద్యోగులు తమకు ఇష్టమైతే కంపెనీ నుంచి వెళ్లిపోవచ్చు. అయితే అందరూ ఉద్యోగాలు వదిలేయాల్సిన అవసరం లేదు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు దాదాపు 23 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం నాలుగు దేశాల్లో దాదాపు 60 వేల మందికి ఈ అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆఫర్‌ను ఎంచుకోవడానికి డిసెంబర్ 1 వరకు గడువు ఇచ్చారు.
అయితే కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం లేకపోలేదు. రాబోయే సంవత్సరాల్లో ఉద్యోగుల బాధ్యతలు, పని చేసే విధానం మారుతాయని సత్య నాదెళ్ల చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతుండటంతో సాఫ్ట్వేర్ తయారీ నుంచి రోజువారీ పనుల వరకు మార్పులు జరుగుతున్నాయి.
గతంలో ఎక్కువ మంది కలిసి చేసే కొన్ని పనులను ఇప్పుడు తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతున్నారు. అయితే ఎగ్జిట్ ఆఫర్‌కు ఏఐ ఒక్కటే కారణమని కంపెనీ చెప్పలేదు. ఉద్యోగుల పనితీరు, కంపెనీ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేపడుతున్నట్లు వివరించింది.
మైక్రోసాఫ్ట్‌లోనే కొనసాగాలనుకునే ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుందని నాదెళ్ల చెప్పారు. కంపెనీ బయట కూడా ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడే నైపుణ్యాలు ఉండాలని సూచించారు. అందుకోసం ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు కొత్త అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
This post was last modified on November 17, 2026 8:29 pm
లెనిన్ నుంచి ఇట్లు అర్జున దాకా నాగార్జున పలు సందర్భాల్లో టాలీవుడ్ దర్శక నిర్మాతలు పనులు వేగవంతం చేసుకోవడం గురించి…
చిన్న వయసులో సక్సెస్ రావడం అంత ఈజీ కాదు. దాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద ఛాలెంజ్. ఇది అందరి వల్లా కాదు.…
ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన భేటీ అయ్యారు. సుమారు గంటన్నర…
తమ ప్రత్యర్థి అయితే చాలు...టార్గెట్ చేయడం, వ్యక్తిత్వహననానికి పాల్పడడం వైసీపీ నేతలకు అలవాటే. నిండు శాసన సభలో అప్పటి ప్రతిపక్ష…
పాన్ ఇండియా స్థాయిలో మంచి టాక్, రివ్యూలు తెచ్చుకున్న సినిమా.. రామాయణం. రిలీజ్ ముంగిట ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో…
జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ గురించి అభిమానులు, సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతూనే…