చిన్న వయసులో సక్సెస్ రావడం అంత ఈజీ కాదు. దాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద ఛాలెంజ్. ఇది అందరి వల్లా కాదు. సోషల్ మీడియాలో కామెడీ మీమ్స్ తో పాపులారిటీ సంపాదించుకున్న మౌళికి 90స్ మిడిల్ క్లాస్, లిటిల్ హార్ట్స్ విజయాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అందులో అనుమానం లేదు. అంతమాత్రాన అతను ఏం చేసినా అంగీకరిస్తారని కాదు. ఎలాంటి జోకులు వేసినా పగలబడి నవ్వుకుంటారని కాదు. వాస్తవిక కోణంలో ఆలోచించకుండా మబ్బుల్లో తేలిపోతే త్వరగా కింద పడే రిస్క్ ఉంటుంది.
డీఎన్‌కే విడుదలయ్యింది. వీకెండ్ దాకా వసూళ్లు ఓ మోస్తరుగా అనిపించినా తర్వాత అసలు విషయం తేటతెల్లమవుతోంది. అయితే హాస్యం పేరుతో చేయించిన చవకబారు ఎంటర్ టైన్మెంట్ మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంట్రో సీన్ లో హీరో ఒక గోడ ముందు ప్రకృతి కార్యక్రమం నిర్వహిస్తుండగా హీరోయిన్ అతన్ని చూస్తుంది. మరుసటి రోజు రెస్టారెంట్ లో కలుసుకున్నప్పుడు హీరో దాని మీద ఒక బూతు జోక్ వేసి హహహ అంటాడు. ఇది చూసి ఆడియన్స్ ఔనా అంటూ వేరే అర్థంలో నవ్వుకుంటారు.
ఇలాంటి మచ్చుతునలకు డీఎన్‌కే.లో బోలెడున్నాయి. కొన్ని షోలు ఫుల్ అయినంత మాత్రాన మనం చేసిన వినోదాన్ని జనం అంగీకరించినట్టు కాదు. ఆ మాటకొస్తే ఒకప్పుడు బూతు బొమ్మలు, ఐటెం సాంగ్స్ చేసేవాళ్ళు నటించిన మలయాళ డబ్బింగులను ఒక వర్గం ప్రేక్షకులు ఎగబడి చూసేవాళ్ళు. అంత మాత్రాన వాటిలో నటించిన వాళ్ళు స్టార్లని అనిపించుకోలేరు. డీఎన్‌కే అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ కామెడీ స్టాంప్ వేసి తీసిన కంటెంట్ ని సమర్ధించే అవకాశమే దర్శకుడు ఇవ్వలేదు.
మౌళి ముందు ఒక ట్రాప్ లో నుంచి బయట పడాలి. సోషల్ మీడియా గ్రూపుల్లో వేసుకునే జోకులు, మీమ్స్ అన్నీ సినిమాలకు పనికి రావు. వాటికి ఆన్ లైన్ లో వ్యూస్ వచ్చాయి కాబట్టి స్క్రీన్ మీద కూడా వర్కౌట్ అవుతాయనుకుంటే అంతకన్నా సిల్లీనెస్ మరొకటి ఉండదు. నువ్వే కావాలి, నువ్వు నేను, కొత్త బంగారు లోకం లాంటి క్లీన్ బ్లాక్ బస్టర్స్ చూసిన హీరోలే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. అలాంటిది డీఎన్‌కే. తరహా కంటెంట్ తో మౌళికి మనుగడ మున్ముందు కష్టమవుతుంది. ముందు కామెడీని క్రింజ్ లా కాకుండా క్వాలిటీలో చూసుకుంటే మంచి భవిష్యత్తుకి దారి దొరుకుతుంది.
This post was last modified on November 17, 2026 7:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన భేటీ అయ్యారు. సుమారు గంటన్నర…
తమ ప్రత్యర్థి అయితే చాలు...టార్గెట్ చేయడం, వ్యక్తిత్వహననానికి పాల్పడడం వైసీపీ నేతలకు అలవాటే. నిండు శాసన సభలో అప్పటి ప్రతిపక్ష…
జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ గురించి అభిమానులు, సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతూనే…
రాజకీయ బాధ్యతల వల్ల పెళ్లి చేసుకోలేదని పలు సందర్భాల్లో సరదాగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడొక రహస్యాన్ని…
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కాలంలో తరచుగా చెబుతున్న `కార్యకర్తే నాయకుడు` అనే మాటను తాజాగా రుజువు చేశారు. ఎన్నో…
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దశాబ్దకాలంగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. భారతదేశానికి…