Movie News

నాని ఇంతకంటే నాన్చకూడదు

రకరకాల తేదీలతో అభిమానులను తెగ అయోమయానికి గురి చేస్తున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 25 విడుదల కావడానికి రెడీ అయ్యిందనేది ఫ్రెష్ అప్డేట్. ఆ మేరకు ఆగస్ట్ వాయిదా గురించి ఆల్రెడీ ఇచ్చిన సమాచారంతో పాటు కొత్త డేట్ ని డిస్ట్రిబ్యూటర్లకు అఫ్ ది రికార్డు చెప్పారని ట్రేడ్ టాక్. అక్టోబర్, డిసెంబర్ నెలల్లో సరైన స్లాట్స్ ఖాళీగా లేకపోవడం, నవంబర్ డ్రై నెల కావడం వల్ల సెప్టెంబర్ అయితేనే అనుకూలంగా ఉంటుందని భావించి ఆ మేరకు ఫిక్స్ అయ్యారట.

ఒకవేళ ఇది ఓకే అనుకుంటే వీలైనంత త్వరగా ప్రకటన ఇచ్చేసి ఇతర సినిమాలు కాంపిటీషన్ రాకుండా చూసుకోవడం అవసరం. ముఖ్యంగా నాని చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. దసరాతో తనకో బ్లాక్ బస్టర్ ఇచ్చాడన్న నమ్మకంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు మరో పెద్ద ఛాన్స్ ఇచ్చాడు నాని. అయితే బడ్జెట్ కంట్రోల్ తప్పిపోవడంతో విపరీతమైన వర్కింగ్ డేస్ ఖర్చయ్యాయి. దానికి తోడు మరీ లేట్ అయితే ఓటిటి డీల్ కూడా రిస్క్ లో పడే ప్రమాదం లేకపోలేదు.

టీమ్ సంగతి ఎలా ఉన్నా ముందైతే నాని విడుదల తేదీ అనౌన్స్ మెంట్ వచ్చేలా చేసుకోవాలి. దర్శకుడు సుజిత్ ప్లాన్ చేసుకున్న బ్లడీ రోమియో హఠాత్తుగా సైడ్ కు వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ ఓజి 2 ప్రచారంలోకి రావడం నాని ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. అంటే తమ హీరోది పక్కన పెట్టి సుజిత్ అటు షిఫ్ట్ అవ్వడానికి కారణం ప్యారడైజ్ ఆలస్యమేనని వాళ్ళు నమ్ముతున్నారు. ఒకవేళ టైంకి అయిపోయి ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదన్నది సదరు అభిమానుల వెర్షన్.

మన దగ్గరే కాదు ఉత్తరాదిలోనూ ప్యారడైజ్ కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆయా షేర్ పాట చాలా కాంట్రిబ్యూట్ చేసింది. పెద్దికి చికిరి చికిరి ఎలా అయితే హైప్ తీసుకొచ్చిందో దీనికి కూడా అదే రిపీట్ అయ్యింది. కాకపోతే మార్కెట్ లో ఉన్న హైప్ తగ్గకుండా ఉండాలంటే రెగ్యులర్ గా కంటెంట్ వదులుతూ ఉండాలి. పెద్ది లాగా ట్రైలర్ విషయంలో పొరపాటు చేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సో నాని ముందుకొచ్చి ఇవన్నీ పర్యవేక్షించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.

This post was last modified on July 3, 2026 10:47 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

54 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

1 hour ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

10 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago