Movie News

ఆరుగురు పతివ్రతలకు అంత సీన్ ఉందా

రీ రిలీజుల ట్రెండ్ జనాలకు మొహం మొత్తిపోయేలా విసిగిస్తోంది. వారానికి ఒకటి రెండు క్రమం తప్పకుండా వీటిని వదులుతూ డిస్ట్రిబ్యూటర్ లాభపడుతున్న దానికన్నా నష్టపోతున్న వైనమే ఎక్కువగా ఉంది. స్టార్ హీరోల సినిమాలను కొంత వరకు సెలెబ్రేట్ చేసుకుంటారు కానీ మిడ్ రేంజ్ హీరోలవి, అందులోనూ యావరేజ్ వి తీసుకొస్తే పబ్లిసిటీ ఖర్చులు కూడా రావు. గోపీచంద్ గౌతమ్ నందాకు వచ్చిన స్పందనే దానికి ఉదాహరణ.

ఇప్పుడో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఆరుగురు పతివ్రతలుని మళ్ళీ థియేటర్లకు తెస్తున్నారు. ఈవీవీ సత్యనారాయణగారి దర్శకత్వంలో వచ్చిన ఈ డిఫరెంట్ డ్రామా 2004లో ఫ్లాప్ గా నిలిచింది. భార్యల మీద భర్తలకున్న మానసిక రుగ్మతలను కాసింత పచ్చిగా చూపించారు ఇందులో. ఆమె తరహాలో సెన్సేషన్ అవుతుందనుకుంటే నిరాశ పరిచింది. ఇలాంటి షాకింగ్ కంటెంట్ కి కొందరు కొత్త ఆర్టిస్టులను దీని ద్వారా పరిచయం చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

కాలక్రమేణా ఆరుగురు పతివ్రతలులో సీన్లు జెన్ జీకి నచ్చడం మొదలయ్యింది. వాటి క్లిప్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో అదే పనిగా ఈ సినిమాని యూట్యూబ్, ఓటిటిలో చూసిన వాళ్ళు చాలానే ఉన్నారు. ఇది ఈవీవీ నిర్మాతగా తీసిన స్వంత సినిమా. సహజంగానే హక్కులు ఆయన పిల్లలు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ దగ్గర ఉంటాయి. అవి కొనుగోలు చేసే ఈ నెలలో రీ రిలీజ్ కు రంగం సిద్ధం చేశారట డిస్ట్రిబ్యూటర్లు.

అంతా బాగానే ఉంది కానీ నిజంగా ఆరుగురు పతివ్రతలను జనాలు థియేటర్ కు వెళ్లి చూస్తారా అంటే అనుమానమే. ఎందుకంటే స్టార్లు, సెలెబ్రేట్ చేసుకునే సాంగ్స్ లేకుండా ఉండే ఇలాంటి సినిమాలను బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయడం కొంచెం కష్టమే. ముఖ్యంగా థియేటర్ లోపల రీ క్రియేషన్లు చేసుకునే బ్యాచులకు ఈ మూవీ ఎలాంటి అవకాశం ఇవ్వదు. ఈవివి గారు బ్రతికి ఉంటే ఇప్పటి యూత్ దీన్ని ఇంతగా ఓన్ చేసుకోవడం చూసి ఎంత ఆశ్చర్యపోయేవారో.

This post was last modified on July 2, 2026 12:01 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago