Movie News

ఇప్పుడు తగ్గి ఏం లాభం పెద్ది?

టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం ఎంత కీలకమో ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉన్నా.. పెద్ద సినిమాల మేకర్స్ తీరు మారదు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని.. ఓటీటీల ప్రభావం గట్టిగా పడుతోందని.. టికెట్ల ధరలు, పాప్ కార్న్ రేట్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వాళ్లే స్టేజ్‌ల మీద అంటుంటారు. తీరా చూస్తే మళ్లీ వాళ్లే ఉన్న రేట్ల మీద అదనంగా వడ్డిస్తారు.

ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడాలని ఆశించే కొంచెం పెద్ద సినిమా వచ్చిందంటే చాలు.. వాటికి రేట్లు పెంచేస్తారు. ‘పెద్ది’ విషయంలోనూ అదే జరిగింది. తెలంగాణలో కోర్టు కేసుల తలనొప్పులున్నా.. కొంత కాలంగా ప్రభుత్వం కూడా రేట్ల పెంపు విషయంలో అంత సానుకూలంగా లేకపోయినా.. పట్టుబట్టి ఈ చిత్రానికి రేట్లు పెంచుకున్నారు. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో ఆల్రెడీ టికెట్ల ధరలు ఎక్కువ అన్న అభిప్రాయం ఉంటే.. వాటి మీద అదనంగా రేట్లు పెంచడం పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు.

‘పెద్ది’కి లాంగ్ రన్ రాలేదంటే అధిక టికెట్ ధరలు ఒక కారణం అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఆడుతుండగానే సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ అందుబాటు ధరలతో థియేటర్లలోకి రావడం, మంచి టాక్ తెచ్చుకోవడంతో ఫ్యామిలీస్ అన్నీ అటు వైపు మళ్లాయి. ‘పెద్ది’ రన్ అర్ధంతరంగా ఆగిపోయింది.

ఐతే ‘పెద్ది’ నామమాత్రంగా నడుస్తున్న ఈ టైంలో ఆ చిత్రానికి తెలంగాణలో టికెట్ల ధరలు తగ్గించారు. సింగిల్ స్క్రీన్ల రేట్లలో గరిష్ఠ ధరను రూ.105గా పెట్టారు. కానీ ఇదేదో రెండో వీకెండ్ తర్వాతే తగ్గించి ఉంటే సినిమాకు కలిసొచ్చేది. రన్ అంతా అయిపోయాక ప్రేక్షకులకు ఏదో వరం ఇస్తున్నట్లు ఇప్పుడు రేట్లు తగ్గించడం మరీ విడ్డూరం.

ఎంత పెద్ద సినిమా అయినా, ఎలాంటి టాక్ తెచ్చుకున్నా సరే.. రెండో వీకెండ్‌ను మించి సినిమా నిలబడడం లేదంటే అధిక టికెట్ ధరలు ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ప్రేక్షకులు కొత్త సినిమా రిలీజైతే వీలైనంత త్వరగా థియేటర్లలో చూడాలనుకుంటారు. వాళ్లు చూడాలనుకున్నపుడు అధిక రేట్లు ఉంటున్నాయి. తర్వాత తగ్గిస్తున్నారు కానీ.. ఇంకొన్ని రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుందిలే అని ఆడియన్స్ అప్పుడు కూడా థియేటర్లకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ సైకిల్ ఇలాగే కొనసాగినంత కాలం.. పెద్ద సినిమాలకు ఆశించిన వసూళ్లు రావడం కష్టమే.

This post was last modified on July 3, 2026 8:05 am

Share

Recent Posts

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

4 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

5 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

8 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

9 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

11 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

12 hours ago