జూన్ నెలలో ఊహించిన దానికన్నా చాలా పెద్ద హిట్టుగా నిలిచిన సమంత మా ఇంటి బంగారం కొన్నవాళ్లకు, డిస్ట్రిబ్యూట్ చేసినవాళ్లకు అందరికీ లాభాలు ఇచ్చింది. మొదటి షో పడకముందే నిర్మాతలు సేఫ్ లో ఉన్న విషయాన్ని రాజ్ నిడిమోరు స్వయంగా చెప్పేశారు. ప్రస్తుతం డెబ్భై అయిదు కోట్లు దాటేసిన ఈ యాక్షన్ కం ఫ్యామిలీ మూవీ వంద కోట్ల క్లబ్బులో చేరుతుందా లేదానే దాని మీద అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది జరిగితే అద్భుతమే.
ఇప్పటికైతే వీక్ డేస్ లోనూ మా ఇంటి బంగారం డీసెంట్ గా ఉంది. అన్ని చోట్ల షెడ్యూల్ చేసిన షోలన్నీ పడుతున్నాయి. జనం రాలేదని ఆపేసినవి దాదాపు లేవు. అంటే క్లాసు మాస్ ఇద్దరికీ బెస్ట్ ఆప్షన్ ఇదే అయిపోయింది. వారాంతంలో కొంచెం సౌండ్ చేయడం మినహా పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయింది. ఓటిటి స్ట్రీమింగ్ ఇంకా టైం ఉన్నప్పటికీ దాని వల్ల అద్భుతాలు జరగకపోవచ్చు. నైజామ్ లో ఈ రోజు నుంచి సింగల్ స్క్రీన్లలో 50 నుంచి 105 రూపాయల టికెట్లు అందుబాటులో తెచ్చారు.
కేవలం హీరోయిన్ ఇమేజ్ మీద నడిచిన టాలీవుడ్ సినిమాలు ఇప్పటిదాకా వంద కోట్ల క్లబ్బులో చేరిన దాఖలాలు లేవు. అరుంధతి వచ్చిన టైంలో టికెట్ రేట్లు ముప్పై నుంచి యాభై రూపాయల లోపే. ఇప్పుడవే టికెట్లు రెండు వందల యాభై రూపాయల దాకా ఉన్నాయి. సో పోలిక సబబు కాదు. ఒకవేళ మా ఇంటి బంగారం కనక హండ్రెడ్ క్రోర్ క్లబ్బులో కనక చేరితే సమంత ఖాతాలో అరుదైన మైలురాయి చేరుతుంది. ఇప్పుడప్పుడే బ్రేక్ చేయడం అసాధ్యం.
కాకపోతే ఈ వారం రెండు రిలీజులు ఉన్నాయి. రావు బహదూర్, నాగబంధం దేనికవే కంటెంట్ పరంగా ప్రామిసింగ్ గా ఉన్నాయి. బాలీవుడ్ మూవీ అల్ఫాకు మల్టీప్లెక్సుల మద్దతు దక్కొచ్చు. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం రన్ తిరిగి కొనసాగాలంటే వీటికొచ్చే టాక్స్ కీలకం కానున్నాయి. ఒకవేళ ఇవి బాగుంటే కనక బంగారం బాగా నెమ్మదించేస్తుంది. అలా లేదంటే మటుకు ఇంకో అవకాశం దక్కుతుంది. హీరో లేకుండా సామ్ ఒక్కర్తే ఇంత ఫీట్ సాధించడం విశేషమే.
This post was last modified on July 1, 2026 11:16 am
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…