‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ ఒక సామాన్య డెలివరీ బాయ్‌తో గొడవ పడటం సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటే మొదటికే మోసం వస్తుంది. ఎంత కష్టపడి పైకి వచ్చినా, ప్రజల్లో ఉండే ఇమేజ్ ఒక్కసారి నెగటివ్‌గా మారితే ఆ ఇంపాక్ట్ నుండి బయటపడటం చాలా కష్టం.
వైరల్ అవుతున్న వీడియోలో హీరో సదరు వ్యక్తిపై నటుడు కోపంగా దూసుకురావడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సెలబ్రెటీగా సామాన్య ప్రజలతో ఎంత స్నేహపూర్వకంగా ఉంటే కెరీర్‌కు అంత పాజిటివ్ ప్లస్ అవుతుంది. పొరపాట్లు ఎవరికైనా జరుగుతుంటాయి, కానీ వాటిని డీల్ చేసే విధానంలోనే ఒక నటుడి మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆన్లైన్ లో ఒకసారి బ్యాడ్ నేమ్ వస్తే ఆ మచ్చను చెరిపేసుకోవడం అంత తేలికైన విషయం కాదు.
అఖిల్ రాజ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఒక మంచి పొజిషన్‌కు చేరుకుంటున్నారు. ఇంటర్ పూర్తి కాగానే ఫోటోగ్రాఫర్‌గా, యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి షార్ట్ ఫీలిమ్స్ చేశారు. గతేడాది కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా జీవితాన్ని మార్చేసింది. ఆ క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడి డప్పు కొట్టడం నేర్చుకున్న అఖిల్ శ్రమను అందరూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్ద బ్యానర్‌లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.
అయితే ఈ ఘటనలో అసలు నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేదానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇలాంటి ఇష్యూస్ ను కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్ వరకే పరిమితం చేయకుండా ఇరువర్గాలు కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుంటేనే అందరికీ మంచిది. ఈ గొడవను ఎంత పెద్దది చేస్తే హీరో కెరీర్‌కు అంత డ్యామేజ్ జరుగుతుంది. తప్పు ఎవరి వైపు ఉన్నా సరే, కూల్‌గా కూర్చొని మాట్లాడి సమస్యను ఇక్కడితో ముగించేయడమే బెస్ట్ ఆప్షన్ అని మరికొందరు నెటిజన్లు చెబుతున్నారు.
This post was last modified on June 30, 2026 2:09 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…