Movie News

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో కార్చిచ్చులా అల్లుకుని ఉండాల్సింది. కానీ అంత ఊపు కనిపించడం లేదు. అభిమానులు, టాలీవుడ్ లవర్స్ నుంచి స్పందన భారీగా ఉంది కానీ న్యూట్రల్ హ్యాండిల్స్, ఇతర భాషల ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అయితే లేదు. కారణం సింపుల్. థీమ్ ని చెప్పే ఉద్దేశంలో టీమ్ ఏఐ టెక్నాలజీ మీద ఆధారపడటమే.

మేకర్స్ ఎవరైనా ఏ సినిమా అయినా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. ఏఐ వాడకం చాలా సులువైపోయింది. ఎలా వాడాలో అర్థం కాకపోతే అదే ఏఐని టిప్స్ అడిగితే చిన్న పిల్లాడికి పాఠం చెప్పినట్టు అప్పజెబుతోంది. దాన్ని ఫాలో అవుతూ అద్భుతాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంజినీరింగ్, సాఫ్ట్ వేర్ నైపుణ్యం అవసరం లేకుండానే తమ టాలెంట్ చూపిస్తున్నారు. అలాంటప్పుడు వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్యాన్ ఇండియా మూవీస్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం అలసత్వం చూపించకూడదు.

దీనికే కాదు డ్రాగన్ టీజర్ వీడియోలో సగం ఏఐతోనే డిజైన్ చేయించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆర్టిస్టులను రివీల్ చేసే దాకా వచ్చే విజువల్స్ అన్నీ అలా సృష్టించినవే, అంచనాలు విపరీతంగా ఉన్నప్పుడు కంటెంట్ వీలైనంత సహజంగా, గ్రాఫిక్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడాలి. అది చిన్న పోస్టర్ అయినా విపరీతమైన శ్రద్ధ అవసరం. లేదంటే లేనిపోని ట్రోలింగ్ తో పాటు ప్రాజెక్టు మీద అంచనాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.

అయినా ఇంత అత్యవసరంగా ఇలా ఏఐతో చేయించిన ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కొందరు ఫాన్సే కామెంట్ చేస్తున్నారు. డ్రాగన్ విడుదల ఇంకా ఏడాది ఉంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ 2029 కంటే ముందే వస్తే గొప్పే. అలాంటప్పుడు ఇంకాస్త టైం ఎక్కువగా తీసుకుని నాణ్యత మీద ఫోకస్ పెడితే బాలీవుడ్ జనాలను కూడా కుదిపేయొచ్చు. రాజమౌళి ఎందుకు పెర్ఫెక్షన్ కోసం తాపత్రయపడతారో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అందుకే ఆయన్ని జక్కన్న అనేది.

This post was last modified on June 29, 2026 9:16 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

7 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

8 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

9 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

9 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

12 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

12 hours ago