సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్. ఇక్కడ పెద్ద సినిమాలు మొదలవుతున్నాయంటే.. సంగీత దర్శకుడిగా తమన్ పేరే ఎక్కువగా పరిశీలనలో ఉంటుంది. టాలీవుడ్డో దాదాపుగా అందరు టాప్ స్టార్లతోనూ అతను సినిమాలు చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ రేసులో వెనుకబడడంతో తమన్ హవా మామూలుగా లేదు. ఒకప్పుడు వరుసగా దేవితో సినిమాలు చేసిన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. చాలా ఏళ్లుగా తమన్‌తోనే ప్రయాణం సాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఆదర్శ కుటుంబం చిత్రానికి కూడా ముందు హర్షవర్ధన్ రామేశ్వర్‌ను ఎంచుకుని, మళ్లీ తమన్ వైపు మళ్లాడు మాటల మాంత్రికుడు. దీని తర్వాత త్రివిక్రమ్ తీసే మెగా మూవీ గాడ్ ఆఫ్ వార్‌కు కూడా తమనే సంగీత దర్శకుడని అందరూ ఫిక్సయిపోయి ఉండగా.. అనూహ్యంగా ఆ స్థానంలోకి తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వచ్చేశాడు.
గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్‌మెంట్ గురించి నిన్న సమాచారం బయటికి వచ్చినపుడే అనిరుధ్ ఈ చిత్రానికి పని చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ త్రివిక్రమ్ తనతో మంచి సింక్ ఉన్న తమన్‌ను వదిలేస్తాడా అని మాట్లాడుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే నిజంగానే అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు తేలింది. ఇది తమన్‌కు పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు. గాడ్ ఆఫ్ వార్‌కు తనే సంగీతం అందిస్తానని కొన్ని నెలల ముందు తమన్ స్వయంగా సంకేతాలు ఇచ్చాడు.
ఆదర్శ కుటుంబం చిత్రానికి ముందే అనుకుని హర్షవర్ధన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారని, కానీ తాను తర్వాత ఓ మెగా మూవీకి మ్యూజిక్ చేస్తానంటూ గాడ్ ఆఫ్ వార్ గురించి హింట్ ఇచ్చాడు తమన్. అలాంటిది ఇప్పుడు అతను కాకుండా అనిరుధ్ ఈ భారీ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ మైథాలజీ మూవీకి ఏ కీరవాణి, మణిశర్మ లాంటి సీనియర్లను సంగీత దర్శకులుగా పెట్టుకుని ఉంటే ఏమో కానీ.. అనిరుధ్‌కు త్రివిక్రమ్ ఓటేయయడం మాత్రం తమన్‌కు మింగుడు పడని విషయమే కావచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates