Movie News

అనుమానాలు తీర్చేసిన ఆదర్శ కుటుంబం

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2 రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. మొదటి సారి ఇతర క్యాస్టింగ్ తో ఉన్న కొత్త పోస్టర్ ని అభిమానుల కోసం పంచుకుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పెట్టు వెంకీ జంటకు పిల్లలుగా నటిస్తున్న ఇద్దరిని రివీల్ చేశారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాని హారికా హాసిని బ్యానర్ మీద తీస్తున్నారు.

దగ్గుబాటి అభిమానుల అనుమానాలకు ఇంతటితో చెక్ పడిపోయాయి. ఆ మధ్య వచ్చిన ఒక తమిళ హిట్ మూవీతో ఆదర్శ కుటుంబంకి కొన్ని పోలికలు ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. దీనికి టీమ్ స్పందించలేదు. టైటిల్ కింద్ ఏకె 47 అనే క్యాప్షన్, రక్తపు మరకలతో చివర్లో చిన్న టచింగ్ చూసి ఇలాంటి అనుమానం వచ్చిందో లేక ఇంకేదైనా ఉందేమో తెలియదు కానీ ఆ కారణంగా రీ షూట్ చేశారనే పుకార్లు కొన్ని రోజులు గట్టిగానే తిరిగింది. కానీ అవేవి నిజం కాదట.

దీని సంగతలా ఉంచితే సోలో హీరోగా వెంకటేష్ కు ఏడాదిన్నర గ్యాప్ వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఆయన ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించలేదు. మన శంకరవరప్రసాద్ గారులో క్యామియో కాబట్టి దాన్ని పూర్తి పరిగణనలోకి తీసుకోలేం. ఆదర్శ కుటుంబం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న కాంబో. నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి బ్లాక్ బస్టర్స్ కు రచయితగా పని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి వెంకటేష్ ని డైరెక్ట్ చేయడం ఇందులో ప్రధాన విశేషం.

ప్రస్తుతానికి ఆ తేదీకి ఎలాంటి పోటీ లేదు. ఎవరూ లాక్ చేసుకోలేదు. జైలర్ 2 అయితే దసరా లేదా దీపావళి అంటున్నారు కాబట్టి ఇబ్బందేం లేదు. ఆదర్శ కుటుంబం పేరు పాతగా అనిపిస్తున్నా ట్రీట్ మెంట్ మాత్రం జెన్ జీ స్టైల్ లో ఉంటుందట. ముందు తీసుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ని వద్దనుకుని మరీ తమన్ కు సంగీత బాధ్యతలు అప్పజెప్పారు కాబట్టి పాటల పరంగా కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఎలా ఉండబోతోందో.

This post was last modified on June 27, 2026 9:58 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago