Movie News

మెగా ఫ్యాన్స్ అన‌గానే బ‌న్నీ పిలిచి…

టాలీవుడ్లో తాను ఎదుగుతూ త‌న కోసం ప‌ని చేసే వాళ్లంద‌రినీ మంచి స్తాయికి తీసుకొచ్చిన క‌థానాయ‌కుల్లో అల్లు అర్జున్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. మారుతి, బ‌న్నీ వాసు, ఎస్కేఎన్.. వీళ్లంద‌రూ బ‌న్నీ ద‌గ్గ‌ర చిన్న స్థాయిలో ప్రయాణం మొద‌లుపెట్టిన వాళ్లే. వీరిలో మారుతి ఏకంగా ప్ర‌భాస్‌తో సినిమా చేసే స్థాయి ద‌ర్శ‌కుడ‌య్యాడు. బ‌న్నీ వాసు గీతా ఆర్ట్స్-2 సంస్థ‌ను చాలా ఏళ్ల పాటు న‌డిపిస్తూ వ‌చ్చారు.

ఇప్పుడు సొంతంగా ప్రొడ‌క్షన్ హౌస్ పెట్టుకున్నాడు. ఎస్కేఎన్ బేబీ సినిమాతో నిర్మాత‌గా సంచ‌ల‌నం రేపాడు. ఇప్పుడు చెన్నై ల‌వ్ స్టోరీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు వీరి బాట‌లో బ‌న్నీ పీఆర్ టీం హెడ్ శ‌ర‌త్ చంద్ర కూడా గుర్తుకొస్తున్నాయి సిరీస్‌తో నిర్మాత అవ‌తారం ఎత్తుతుఉన్నాడు. ఈ ఈవెంట్‌కు అతిథిగా హాజ‌రైన ఎస్కేఎన్.. బ‌న్నీ త‌మ జీవితాల‌ను ఎలా మార్చేశాడో గుర్తు చేసుకున్నాడు.

బ‌న్నీ పీఆర్ టీంలో చేర‌డానికి త‌మకు అప్ప‌ట్లో ఉన్న ఏకైక అర్హ‌త మెగా ఫ్యాన్స్ కావ‌డ‌మే అని ఎస్కేఎన్ చెప్పాడు. తాము మెగా ఫ్యాన్స్ అన‌గానే పిలిచి త‌మ‌కు ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించాడు ఎస్కేఎన్. ముందు తాను బ‌న్నీ పీఆర్ టీంను న‌డిపించేవాడిన‌ని.. తర్వాత తాను పూర్తి స్థాయి నిర్మాత‌గా మారాలి అనుకున్న‌పుడు ఎంత స్ట్రెస్‌తో కూడుకున్న ఈ జాబ్ చేయ‌డానికి స‌రైన వ్య‌క్తి ఎవ‌రు అని చూస్తే శ‌ర‌త్ చంద్ర క‌నిపించాడ‌ని.. త‌న త‌ర్వాత త‌న కంటే బాగా ఆ బాధ్య‌త‌లు చూశాడ‌ని ఎస్కేఎన్ వెల్ల‌డించాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద అభిమానుల కోసం శ‌ర‌త్ ఒక వెబ్ సైట్ న‌డిపేవాడ‌ని.. ఆ స్థితి నుంచి ఇప్పుడు నిర్మాత‌గా మారే స్థాయికి వ‌చ్చాడ‌ని ఎస్కేఎన్ చెప్పాడు. త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసేవాళ్లు ఎక్క‌డ మొద‌లుపెట్టారో అక్క‌డే ఉండిపోవాల‌ని బ‌న్నీ అనుకోడ‌ని.. అంద‌రూ పెద్ద స్థాయికి వెళ్లాల‌ని వారిని ప్రోత్స‌హించి త‌మ అంద‌రినీ నిర్మాత‌ల్ని చేశాడ‌ని ఎస్కేఎన్ అన్నాడు.

ప్రొడ‌క్షన్ హౌస్‌ల నుంచి కొత్త నిర్మాత‌లు రావ‌డం మామూలే కానీ.. ఒక హీరో టీం నుంచి ఇంత‌మంది నిర్మాత‌లుగా మార‌డం అరుదైన విష‌య‌మ‌ని, అదే బ‌న్నీ స్పెషాలిటీ అని ఎస్కేఎన్ వ్యాఖ్యానించాడు. మ‌రోవైపు శ‌ర‌త్ చంద్ర కూడా త‌న ఉన్న‌తికి బ‌న్నీనే కార‌ణం అంటూ.. ప‌ట్టుబ‌ట్టి త‌న‌ను నిర్మాత‌ను చేశాడ‌ని చెప్పుకొచ్చాడు.

This post was last modified on June 27, 2026 6:09 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago