Movie News

సమంత… ఈ విషయంలోనూ హీరోలతో పోటీ

హీరోలు పెద్ద రేంజికి వెళ్లే క్రమంలో తమ దగ్గర అసిస్టెంట్లుగా పని చేసిన వాళ్లకు కూడా ఒక పుష్ ఇచ్చి మంచి స్థాయికి తీసుకొస్తుంటారు. అల్లు అర్జున్ దగ్గర పని చేసిన బన్నీ వాసు, ఎస్కేఎన్ లాంటి వాళ్లు ఎలా ఇండస్ట్రీలో పేరున్న నిర్మాతలుగా ఎదిగారో తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ డ్రైవర్‌గా మొదలుపెట్టి.. ఇప్పుడు అక్కడ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఆధిపత్యం చలాయిస్తున్నాడు ఆంటోనీ పెరువంబూర్.

ఇలా స్టార్ హీరోల అండతో డిస్ట్రిబ్యూటర్లుగా, నిర్మాతలుగా ఎదిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఐతే హీరోల మద్దతు ఉన్న వాళ్లే ఇలా రైజ్ అవుతుంటారు. ఐతే హీరోయిన్లలో ఇలాంటి ఇమేజ్, సపోర్ట్ సిస్టమ్ ఉన్న వాళ్లు అరుదు. గతంలో విజయశాంతి దగ్గర మేకప్ మ్యాన్‌గా పని చేసిన ఏఎం రత్నం ఎంత పెద్ద నిర్మాత అయ్యారు. ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత రేంజ్ వేరు. ఆమె కూడా తన అసిస్టెంట్ ఒకరికి ఇలాంటి పుష్ ఇచ్చి డిస్ట్రిబ్యూటర్‌గా నిలబెట్టడం విశేషం.

తన పేరు.. ఆర్య. సమంత దగ్గర ఎన్నో ఏళ్లుగా అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆర్య.. ‘మా ఇంటి బంగారం’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. ఈ చిత్రం అతడికి మంచి లాభాలు తెచ్చిపెట్టి డిస్ట్రిబ్యూటర్‌గా నిలబెట్టింది. దీంతో అతను ఈ సినిమా సక్సెస్ మీట్లో స్టేజ్ మీద తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సమంత తన కోసం ఎంత చేసిందో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సమంతను దేవతగా అబివర్ణిస్తూ, ఆ గుడిలో తనకు ప్రవేశం దక్కడం అదృష్టమని అన్నాడు.

ఆమె తమ బంగారం అని.. ఆ బంగారాన్ని బంగారంలా చూసుకుంటున్నందుకు రాజ్ నిడిమోరుకు థ్యాంక్స్ అని చెప్పాడు. ఒక సినిమా కోసం సమంత ఎంత కష్టపడుతుందో, రిలీజ్ టైంలో ఎంత టెన్షన్ పడుతుందో మీకు తెలియదు అంటూ ఆమె ప్యాషన్‌ను గుర్తు చేశాడు ఆర్య.

అతను కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా మాట్లాడ్డంతో సమంతకూ కన్నీళ్లు ఆగలేదు. సక్సెస్ మీట్లో ఎందరో మాట్లాడినా ఈ స్పీచే హైలైట్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, సినిమాల బిజినెస్, కలెక్షన్ల విషయంలోనే కాదు.. తమ అసిస్టెంట్లకు పుష్ ఇచ్చి ఇండస్ట్రీలో మంచి స్థాయికి తీసుకెళ్లడంలోనూ హీరోలతో సమంత పోటీ పడుతోందని.. తన రేంజే వేరని అభిమానులు కొనియాడుతున్నారు.

This post was last modified on June 27, 2026 3:16 pm

Share

Recent Posts

రెబ‌ల్స్… గెలిచేశారు.. ఏం చేస్తారు?!

టీడీపీ, జ‌నసేన‌, బీజేపీ కూట‌మి ఐక్యంగా ముందుకు సాగినా.. క్షేత్ర‌స్థాయిలో నెల‌కొన్న అసంతృప్తుల కార‌ణంగా.. ఆయా పార్టీల నుంచి రెబ‌ల్స్…

32 minutes ago

కింగ్‌ని తక్కువంచనా వేయకూడదు

హిందీ సినిమాల రిలీజులతో మనకు పెద్ద సమస్య ఉండదు కానీ షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఉన్నాడంటే అంత…

2 hours ago

వైసీపీ ఎంపీ ‘అతి’కి సుప్రీం బ్రేక్

వైసీపీ తిరుప‌తి ఎంపీ గురుమూర్తిపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. "ఎంపీగారు అతిగా స్పందిస్తున్నారు. ఇలా అయితే.. భారీ జ‌రిమానాను…

3 hours ago

రావిపూడి+ సంక్రాంతి లేకపోతే.. వెంకీ ఇంతేనా?

టాలీవుడ్లో ఇమేజ్, ఫ్యాన్స్ అని లెక్కలు వేసుకోకుండా.. కలెక్షన్లు, రికార్డుల గురించి అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేసే హీరో విక్టరీ…

3 hours ago

వేగం కన్నా ముఖ్యంగా వివేకం కావాలి

స్వీయ దర్శకత్వంలో, ఎవరూ టచ్ చేయని జానర్ అంటూ పూర్తిగా వయొలెంట్ రూటు పట్టిన విశ్వక్ సేన్ కు 'కల్ట్'…

3 hours ago

జగన్ స్పీచ్ లే ట్రోలర్స్ కు శ్రీరామ రక్ష

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి అధ్యక్షుడు…

3 hours ago