Movie News

అందాల చిన్న కోడలు… శ్రీముఖికి కొత్త అవకాశాలు తెస్తుందా?

బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీముఖి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ తన ఫాలోవర్స్ కు టచ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన చీరకట్టు ఫోటోలు ఫాలోవర్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాయి. డార్క్ బ్లూ బ్యాక్ గ్రౌండ్ లో ఆకుపచ్చ రంగు పట్టుచీరలో సంప్రదాయంగా కనిపిస్తూనే తనదైన గ్లామర్ తో నెటిజన్ల దృష్టిని లాగేసింది. మీ ఇంటి బంగారం మీ చిన్న కోడలు అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

ఇటీవల థియేటర్లలోకి వచ్చిన మా ఇంటి బంగారం సినిమాలో శ్రీముఖి చిన్న కోడలు అనసూయ పాత్రలో నటించింది. చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ క్యారెక్టర్ దక్కింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ పక్కన నటించినా కూడా ఎక్కడా తగ్గకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో ఇల్లాలిగా శ్రీముఖి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రిపోర్ట్స్ వచ్చాయి.

ఈ సినిమాలో సమంత పెద్ద కోడలు స్వర్ణ పాత్రలో కనిపించగా ఆమెకు శ్రీముఖి పాత్రకు మధ్య వచ్చే సీన్స్ భలే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అనసూయ చేసే పర్ఫెక్ట్ పనులను చూసి స్వర్ణ టెన్షన్ పడే కామెడీ ట్రాక్ థియేటర్లలో ఆడియన్స్ ను బాగా నవ్వించింది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న ఇలాంటి వెయిట్ ఉన్న పాత్రలు చేయడం వల్ల శ్రీముఖి యాక్టింగ్ స్కిల్స్ ఏంటో మేకర్స్ కు మరోసారి అర్థమైంది.

గతంలో క్రేజీ అంకుల్స్ భోళా శంకర్ లాంటి సినిమాల్లో చేసిన శ్రీముఖికి ఈ లేటెస్ట్ మూవీ ఒక డీసెంట్ కంబ్యాక్ లాంటిది. ప్రస్తుతానికి ఆమె చేతిలో కొత్త సినిమా ఆఫర్స్ ఏమీ లేకపోయినా ఈ చిన్న కోడలు క్యారెక్టర్ తెచ్చిన పేరుతో ఆమె కెరీర్ గ్రాఫ్ మారే ఛాన్స్ కనిపిస్తోంది. రియాలిటీ షోలతో ప్రైమ్ టైమ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి కంటెంట్ ఉన్న పాత్రలు వస్తే ఆమెను వెండితెరపై మరింత తరచుగా చూసే అవకాశం కచ్చితంగా ఉంటుంది.

ఒకవైపు బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతూనే వెండితెరపై కూడా తన మార్క్ చూపించేందుకు శ్రీముఖి వేస్తున్న అడుగులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒక పక్క హుందాగా సంప్రదాయ చీరకట్టులో కనిపిస్తూనే తనదైన స్టైల్ లో గ్లామర్ డోస్ పెంచుతూ అభిమానులను అట్రాక్ట్ చేయడంలో ఆమె వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతోంది. మరి అమ్మడికి రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

This post was last modified on June 27, 2026 12:30 pm

Page: 1 2 3 4

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

1 hour ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

2 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

5 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

7 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago