మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడుతున్న క్రికెట్ చివరి ఓవర్ కు వచ్చేసింది. బుక్ మై షోలో నిన్నటిదాకా కాస్త నెమ్మదించిన పెద్ది ఇవాళ మళ్ళీ గంటకు వెయ్యికు పైగా టికెట్లతో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పాతిక రోజులకు దగ్గరగా ఉన్న టైంలో ఇది జరగడం మంచి సంకేతమే. తెలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన పెద్ది బయట, ఓవర్సీస్ లో ఆశించిన ఫలితం అందుకోలేకపోవడం అభిమానులను కాస్త నిరాశ పరిచినా తమ హీరోకు పెర్ఫార్మన్స్ పరంగా వచ్చిన పేరుతో సంతోషంగా ఉన్నారు.
గత కొన్ని రోజులుగా నిర్మాణ సంస్థ కలెక్షన్ నెంబర్లు ఇవ్వడం లేదు. ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల మధ్యలో ఉందని వినిపిస్తోంది కానీ ప్రొడక్షన్ హౌస్ అంతకంటే ఎక్కువే క్లెయిమ్ చేస్తోంది. సరే ఈ అంకెల ప్రహసనం ఎప్పుడూ ఉండేదే కానీ పెద్ది పికప్ ను సానుకూల కోణంలో చూడాలి. మా ఇంటి బంగారం ఊపులో మిగిలిన సినిమాలేవీ నిలబడలేని టైంలో ఒక్క చరణ్ మూవీ మాత్రమే థియేటర్లలో షోలు పడేలా చేస్తోంది.
పాజిటివ్ టాక్ వచ్చి, యూనిట్ విస్తృతంగా ప్రమోషన్లు చేసిన దీవానా కింది స్థాయి కేంద్రాల్లో ఎదురీదుతోంది. దీన్ని బట్టి జనాల పల్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతంగా లేకుంటే చిన్న సినిమాలు చూసే మూడ్ లో లేరనే క్లారిటీ వస్తోంది. మా ఇంటి బంగారంని ముందుగా నిలబెట్టి ఓపెనింగ్స్ తెచ్చింది సామ్ ఇమేజ్. తర్వాత అసలైన కంటెంట్ మాట్లాడింది. పెద్దిని మొదటి రెండు వారాలు టికెట్ రేట్ల కారణంగా చూడలేని వాళ్ళు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు కొత్త సీన్లతో చూస్తున్నారు.
ఓటిటి ఎంత గ్యాప్ తో అగ్రిమెంట్ చేసుకున్నారనేది బయటికి రాలేదు కానీ డిజిటల్ ప్రీమియర్ ఎంతో దూరంలో ఉండకపోవచ్చు. జూలై రెండో వారం నెట్ ఫ్లిక్స్ లో వస్తుందని డిజిటల్ వర్గాలు అంటున్నాయి. ఆ లెక్కన ఇంకో వీకెండ్ పెద్దికి దొరకదు. పైగా భారీ పబ్లిసిటీతో జూలై 3 నాగబంధం, రావు బహదూర్ లాంటి కొత్త రిలీజులు క్యూ కడుతున్నాయి. సో అక్కడి నుంచి పెద్దికి ఫేర్ వెల్ మొదలైపోతుంది. ఈలోగా ఎంత వసూలు చేస్తుందనే దాని మీద బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
This post was last modified on June 27, 2026 3:09 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…