తమిళ సినీ పరిశ్రమలో “స్క్రీన్‌ప్లే కింగ్”గా పేరొందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మృతితో సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. అయితే ఆయనకు తెలుగు రాష్ట్రాలతో, ముఖ్యంగా గుంటూరుతో ఉన్న అనుబంధం చాలామందికి తెలియని విశేషం. ప్రముఖ నటి పూర్ణిమ జయరామ్ గుంటూరుకు చెందిన కుటుంబానికి చెందినవారు కావడంతో, ఆమెను వివాహం చేసుకున్న తర్వాత భాగ్యరాజ్‌ను అభిమానులు ప్రేమగా “గుంటూరు అల్లుడు” అని పిలిచేవారు.
భాగ్యరాజ్ తొలి వివాహం 1981లో నటి ప్రవీణతో జరిగింది. అయితే ఆమె 1983లో అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం 1984 ఫిబ్రవరి 7న తనతో కలిసి ‘డార్లింగ్.. డార్లింగ్.. డార్లింగ్’ చిత్రంలో నటించిన పూర్ణిమ జయరామ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పూర్ణిమ ‘మగమహారాజు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గుంటూరుకు చెందిన కుటుంబంలోకి అల్లుడిగా అడుగుపెట్టిన భాగ్యరాజ్‌కు తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. తెలుగు సినీ వేడుకలు, అభిమానుల సమావేశాల్లో ఆయనను “గుంటూరు అల్లుడు” అని సంబోధించడం ఆనవాయితీగా మారింది. ఆయన కూడా తెలుగు అభిమానుల అభిమానాన్ని ఎంతో ఆప్యాయంగా స్వీకరించేవారు.
కుటుంబ కథా చిత్రాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన భాగ్యరాజ్, రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేశారు. ‘అంద 7 నాట్కళ్’ (తెలుగులో ‘రాధా కళ్యాణం’), ‘ముందనై ముడిచ్చు’ (తెలుగులో ‘మూడు ముళ్లు’) వంటి చిత్రాలు ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచాయి. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’, వెంకటేష్ నటించిన ‘సుందరకాండ’ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించి విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
This post was last modified on June 27, 2026 2:41 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…