Movie News

వెంకటేష్ వైపు ఇద్దరు దర్శకుల చూపు

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం. ఇది అక్టోబర్ విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ కాగానే ప్రమోషన్లు మొదలుపెడతారు. రెండోది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మొదలుపెట్టిన మల్టీస్టారర్. కళ్యాణ్ రామ్ మరో హీరో. కేవలం మూడు నెలల గ్యాప్ లోనే ఇవి థియేటర్లకు వచ్చేలా ఉన్నాయి. వీటి తర్వాత వెంకీ ఎవరికి కమిట్ మెంట్ ఇస్తారనేది సస్పెన్స్ గా ఉండిపోయింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వెంకటేష్ కోసం ఇద్దరు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. మొదటి పేరు వశిష్ఠ. విశ్వంభర కోసం ఆల్రెడీ మూడు సంవత్సరాలు లాకైపోయాడు. రిలీజ్ ఎప్పుడు ఉంటుందో ఇంకా తేలనే లేదు. విఎఫెక్స్ నాగ్ అశ్విన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గౌర హరి చూస్తున్నారనే ప్రచారం జోరుగా ఉన్నా వాటికి కూడా స్పందన లేదు. చిరు రికమండేషన్ తోనే వశిష్ఠ వెంకీని కలిసినట్టుగా ఒక టాక్ ఉంది. అదే నిజమైతే ఈ ఫాంటసీ దర్శకుడికి మంచి బ్రేక్ దొరికినట్టే.

ఇక రెండో పేరు బాబీ కొల్లి. ప్రస్తుతం మెగాస్టార్ 158ని చకచకా పరుగులు పెట్టిస్తున్న ఈ దర్శకుడు సంక్రాంతి బరిలో దింపాలనే లక్ష్యంతో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు. తను కూడా వెంకీని కలిశారట. వీళ్ళ కలయికలో గతంలో వెంకీ మామ వచ్చింది. బ్లాక్ బస్టర్ కాదు కానీ డీసెంట్ గానే ఆడింది. నాగచైతన్య అందులో నిజ జీవితంలోలా మేనల్లుడిగా నటించాడు. ఆ బాండింగ్ తోనే బాబీ కొల్లి వెంకటేష్ ని కలిసినట్టుగా తెలిసింది. స్టోరీ లైన్ మాత్రమే డిస్కషన్ జరిగిందట.

ఇద్దరిలో ఎక్కువ అవకాశం వశిష్ఠకే ఉన్నట్టు సమాచారం, సురేష్ ప్రొడక్షన్స్, నల్లమలపు బుజ్జి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కించేందుకు స్టేజి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా ఇవ్వాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఏకంగా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న వెంకీ ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నారు. వసిష్ఠ ఈసారి ఫాంటసీ జోలికి వెళ్లడం లేదంటున్నారు. యాక్షన్ టచ్ ఉన్న కమర్షియల్ ఎంటర్ టైనర్ వినిపించారని టాక్. అఫీషియలయ్యాక క్లారిటీ వస్తుంది.

This post was last modified on June 26, 2026 12:57 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

1 hour ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

2 hours ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

4 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

4 hours ago