రజనీకాంత్ హీరోగా గత పదేళ్లలో వచ్చిన బెస్ట్ మూవీ ఏదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు జైలర్ ఒక్కటే. కమర్షియల్ గా భారీ విజయం అందుకోవడమే కాదు ఇమేజ్ తగ్గిపోయిన తెలుగు మార్కెట్ లోనూ ఆయనకు డబ్బులు తీసుకొచ్చింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ స్టార్ లీగ్ లోకి వెళ్ళిపోయాడు. అందుకే జైలర్ 2 మీద ప్రకటన స్టేజి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదల ఇప్పటిదాకా అయోమయంలోనే ఉంది.
చెన్నై వర్గాల కథనం ప్రకారం జైలర్ 2 దసరా పండగను టార్గెట్ చేసుకుంటోందట. అక్టోబర్ 17 రిలీజ్ చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించే పనిలో సన్ పిక్చర్స్ బిజీగా ఉన్నట్టు సమాచారం. నిజానికి అది మంచి స్లాట్. ఎందుకంటే చెప్పుకోదగ్గ పెద్ద మూవీ ఇప్పటికైతే షెడ్యూల్ కాలేదు. బాలకృష్ణ 111, చిరంజీవి విశ్వంభర అంటున్నారు కానీ ఇంకా వాటి సంగతి తేలలేదు. సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా టాక్ లో ఉంది కానీ ఎప్పుడు ఫైనల్ అవుతుందో క్లారిటీ లేదు.
జైలర్ 2కి క్యామియోల విషయంలో చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి. బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ నో చెప్పాక హృతిక్ రోషన్ ని తీసుకొచ్చారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ అయినా ఉన్నారో లేదో టీమ్ చెప్పడం లేదు. వీటికి చాలా సమయం వృథా అయ్యింది. రజని డేట్లు కూడా వేస్టయ్యాయి. ఇప్పుడు అంతా సర్దుకుంటోంది కాబట్టి వీలైనంత త్వరగా అభిమానులకు శుభవార్త చెప్పాలని బయ్యర్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఇంకా బిజినెస్ ప్రారంభం కాలేదు.
తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే జైలర్ 2 హక్కుల కోసం పెద్ద డిమాండ్ ఉంది. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కూలి యాభై కోట్లకు అమ్మారు కాబట్టి జైలర్ 2 కనీసం డెబ్భై కోట్ల రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారట. కానీ అంత మొత్తం ఏపీ తెలంగాణ నుంచి అంటే రిస్కవుతుంది. యునానిమస్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న జైలర్ సైతం ఆ మార్కు అందుకోలేదు. జైలర్ 2లో మొదటి భాగంలో ఉన్న పాత్రలన్నీ రిపీట్ కాబోతున్నాయి కానీ ముత్తువేల్ పాండియన్ ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా ఉండొచ్చని వినికిడి.
This post was last modified on June 26, 2026 11:25 am
భారత పోరుగు దేశం, దేవభూమి నేపాల్‌లో ఒక్కసారిగా సంభవించిన జల ప్రళయం.. ప్రజలను అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా ఉప్పొంగిన కోశీ…
మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…