Movie News

బాహుబలి 3… వినడానికి బాగుంది కానీ…

తాజాగా నెట్ ఫ్లిక్స్ లో ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ అనే డాక్యు సిరీస్ విడుదలయ్యింది. మొత్తం నాలుగు ఎపిసోడ్లు కలిపి సుమారు రెండు గంటల నిడివితో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని మేకింగ్ కంటెంట్ అందులో పొందుపరిచారు. ప్రభాస్, అనుష్క, రాజమౌళితో సహా ప్రధాన కాస్ట్ అండ్ క్రూ పంచుకున్న విశేషాలు, సెట్స్ లో పడ్డ అష్టకష్టాలు, తెరవెనుక ఏం జరిగిందో వివరించే సంఘటనలు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. మొదలుపెడితే చివరి దాకా చూసేలా ఉంది.

చివర్లో బాహుబలి 3 ఉంటుందని దగ్గుబాటి రానాతో చెప్పించడం, దానికి పక్కనే ఉన్న ప్రభాస్, అనుష్క సానుకూలంగా సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోయారు. నిజానికి ఇది మంచి ఐడియానే. వినడానికి చాలా బాగుంది. కానీ కార్యరూపం దాల్చడం అంత సులభం అయితే కాదు. ఎందుకంటే బాహుబలి ఎటర్నల్ వార్ పేరుతో ఆల్రెడీ ఒక యానిమేటెడ్ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. అందులో బాహుబలి గతం ఉంటుంది.

మరి బాహుబలి 3 నిజంగా తీసే పనైతే ఏం కథ చెబుతారనేది అసలు ట్విస్ట్. టార్చ్ బేరర్ లో ఉన్న వీడియో తాజాగా షూట్ చేసింది కాదు. ముగ్గురి లుక్స్ ని బట్టి చూస్తే గత సంవత్సరం తీసినట్టు ఉంది. సో ఆ టైంలో ఏదో ఫ్లోలో బాహుబలి3 అనేసుకుని ఉండొచ్చు. దాన్నే ఇందులో పొందుపరిచి ఉండొచ్చు. ఆర్ఆర్ఆర్ నుంచి గమనిస్తే రాజమౌళి ఎక్కడా మూడో బాహుబలిని తీస్తానని మాట వరసకు కూడా చెప్పలేదు. సో వెంటనే ఒక అభిప్రాయానికి రాలేం.

ఒకవేళ నిజంగా జరిగితే అంతకన్నా సంతోషం డార్లింగ్ ఫ్యాన్స్ కి ఏముంటుంది కానీ సగటు మూవీ లవర్స్ మాత్రం వారణాసి తర్వాత రాజమౌళి ఇంకో కొత్త జానర్, సబ్జెక్టుతో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచాలని కోరుతున్నారు. బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లూజన్, బాహుబలి ఎపిక్, బాహుబలి టార్చ్ బేరర్, బాహుబలి ఎటర్నల్ వార్ పేర్లతో ఇలా ఫ్రాంచైజ్ మొత్తం పిండేశారు కదా. మళ్ళీ ఇంకో సీక్వెల్ అవసరమా అనే కామెంట్స్ లేకపోలేదు. చూడాలి మరి ఏం చేస్తారో.

This post was last modified on June 26, 2026 11:17 am

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

34 minutes ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

1 hour ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

2 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

3 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

3 hours ago