పెద్ది బ్లాక్ బస్టర్ అయినప్పటికీ దాని విజయం తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితం కావడం అభిమానులకు కొంత అసంతృప్తి మిగిల్చింది. ఓవర్సీస్, ఉత్తరాదితో పాటు తమిళ కేరళలో ఆశించిన వసూళ్లు రాకపోవడం నిరాశ కలిగించే విషయమే. సరే కమర్షియల్ లెక్కల సంగతి ఎలా ఉన్నా రామ్ చరణ్ పడిన కష్టం ఆడియన్స్ కి పూర్తిగా చేరింది. కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ దానికి తగ్గ గౌరవాన్ని అందుకున్నాడు. ఇక అందరి చూపు ఆర్సి 17 మీదకు వెళ్తోంది.
రంగస్థలం తర్వాత రిపీట్ అవుతున్న కాంబో కావడంతో ప్రకటన నుంచే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్యాన్ ఇండియా మూవీని దర్శకుడు సుకుమార్ రెండు భాగాలుగా తీయబోతున్నారని తెలిసింది. కెజిఎఫ్, పుష్ప లాగా ఒకదాని తర్వాత మరొకటి కాకుండా దురంధర్ స్టయిల్ లో సమాంతరంగా తీసి తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు ఉండేలా చూస్తారట. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ ఆల్రెడీ ఇదే తరహా ప్లానింగ్ లో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్.
ఒకవేళ ఇది నిజమైతే సమర్ధించాల్సిన నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే చరణే కాదు టయర్ వన్ హీరోలు అందరికీ ప్రధానంగా వస్తున్న సమస్య ప్రతి సినిమాకు మధ్య ఉంటున్న గ్యాప్. కనీసం రెండు సంవత్సరాలు టైం పెట్టుకుని మరీ ప్యాన్ ఇండియాలకు అంకితం అయిపోతున్నారు. ఇలాంటప్పుడు ఒకేసారి రెండు భాగాలు తీయడం ద్వారా సీక్వెల్ క్రేజ్ తో పాటు ఎక్కువ కాలం తెరకు దూరమయ్యామనే అసంతృప్తిని హీరోల మనసులో తగ్గించవచ్చు.
డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావొచ్చని తెలిసింది. సుకుమార్ ఈసారి పల్లెటూళ్ళు, అడవులు వదిలి నగరం బాట పట్టారట. స్టయిలిష్ యాక్షన్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట. హీరోయిన్, ఇతర క్యాస్టింగ్ ప్రాథమికంగా ఓకే అయ్యింది కానీ ఇంకా అఫీషియల్ గా లాక్ చేయాల్సి ఉంది. షూటింగ్ డేట్స్ ఫిక్స్ అయితే తప్ప కాల్ షీట్లు తీసుకోలేరు. అందుకే వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలిసింది. పుష్ప తర్వాత మూవీ కావడంతో సుకుమార్ కిది చాలా కీలకం కానుంది.
This post was last modified on June 26, 2026 11:33 am
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…