విజయ్‌తో త్రిషకు చెడిందా?

విజయ్, త్రిషల బంధం గురించి గత కొన్ని నెలల్లో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. గతంలోనూ వీళ్లిద్దరూ సన్నిహితంగా కనిపించేవారు కానీ.. వారిది కేవలం సినిమా స్నేహమే అని.. ఇద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అనుకునేవారు. కానీ తన భార్య సంగీత నుంచి విజయ్ విడాకులకు సిద్ధమైన సమయంలో విజయ్‌కి త్రిష అత్యంత సన్నిహితంగా మెలగడం.. ఎన్నికల ముంగిట ఈ ఇద్దరూ జంటగా ఒక పెళ్లికి కూడా హాజరు కావడంతో ఇది మామూలు రిలేషన్ కాదని అర్థమైంది.

సంగీత నుంచి విడాకులు తీసుకుని, త్రిషను విజయ్ పెళ్లి చేసుకుంటాడని కూడా ప్రచారం జరిగింది. కానీ విజయ్ ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజుల తర్వాత వేగంగా పరిస్థితులు మారిపోయాయి. విజయ్‌కి, త్రిషకు మధ్య దూరం పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. తన భార్య సంగీతతో విజయ్ మళ్లీ కలవబోతున్నట్లుగా ఇటీవల జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దే సమయంలో ఆయన్నుంచి త్రిష నుంచి దూరం జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ ప్రతి పుట్టిన రోజుకూ ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేసి స్పెషల్ విషెస్ చెప్పడం త్రిషకు అలవాటు. కానీ నిన్న విజయ్ 52వ పుట్టిన రోజు సందర్భంగా మాత్రం త్రిష ఎలాంటి పోస్టు పెట్టలేదు. పైగా విజయ్‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి అనుకోకుండా జరిగిన పరిణామాలా లేక.. నిజంగానే త్రిషకు, విజయ్‌కి మధ్య దూరం పెరిగిందా అన్న చర్చ జరుగుతోంది

రాజకీయాల్లోకి రావాలని త్రిష ఎంతో ఆశపడిందని, విజయ్ గెలిచి ఖాళీ చేసిన రెండో స్థానం తిరుచిరాపల్లి నుంచి ఆమె పోటీ చేయాలనుకుంటోందని ఇంతకుముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సీటును త్రిషకు ఇవ్వట్లేదని స్పష్టమైంది. దీనికి తోడు సంగీతతో విజయ్ మళ్లీ కలిసిపోనున్నట్లు కూడా వార్తలు రావడంతో.. ఈ పరిణామాలను జీర్ణించుకోలేక త్రిష విజయ్‌కి దూరమైందేమో అన్న చర్చ జరుగుతోంది.