Movie News

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. ప్రమోషన్ల సమయంలో తను చెప్పుకున్న బాధలు, సినిమాలో నటన గురించి సోషల్ మీడియాలో కాసింత ట్రోలింగ్ కూడా జరిగింది. విజయ్ దేవరకొండ జోడిగా నటించిన ఖుషి దానికన్నా కాస్త మెరుగ్గా ఆడినప్పటికీ ఫైనల్ రిజల్ట్ అంతంత మాత్రమే. ఆ తర్వాత గ్యాప్ వచ్చేసింది.

మధ్యలో సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ ఫ్లాప్ కావడం ఇంకో ఎదురుదెబ్బ. ఎందుకంటే దాని కోసం చాలా కష్టపడింది. అయినా ఫలితం దక్కలేదు. వ్యక్తిగత జీవితం కొంత టార్గెట్ కావడం, పెళ్లికి ముందు రాజ్ నిడిమోరుతో ప్రేమ వ్యవహారం మీడియాకు ఎక్కడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకున్న బేస్ ని ఇవేవి తగ్గించలేకపోయాయి. దానికి సాక్ష్యంగా మా ఇంటి బంగారం కలెక్షన్లు నిలుస్తున్నాయి. ఫస్ట్ వీక్ లోనే అర సెంచరీ గ్రాస్ దాటేసింది సామ్.

మాములుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేటప్పుడు నిర్మాతలకు చాలా రిస్క్ ఉంటుంది. కేవలం హీరోయిన్ ఇమేజ్ మీద డబ్బులు వస్తాయనే గ్యారెంటీ ఉండదు. అనుష్క ఎంత ఇమేజ్ సంపాదించుకున్నా రుద్రమదేవి యావరేజ్ ముద్రతో గట్టెక్కితే ఘాటీ చాలా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి ఉండటం వల్ల మరో మూవీ సేఫ్ అయ్యింది. లుక్స్ పరంగా అనుష్క ఎదురుకున్న సమస్య వల్ల బయట కనిపించడం కూడా మానేసింది. కానీ సమంత అలా కాదు. నిత్యం పబ్లిక్ లైఫ్ లో కనిపిస్తూనే ఉంటుంది.

తల్లి కాబోతున్న శుభ తరుణంలో ఇప్పటికిప్పుడు సమంత కొత్త సినిమాలు చేయకపోవచ్చు. కొంత బ్రేక్ తీసుకుని నయనతార లాగా మళ్ళీ కంబ్యాక్ అయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. మా ఇంటి బంగారం జోరు చూస్తుంటే వంద కాదు కానీ ఓ డెబ్భై ఎనభై కోట్ల దాకా చేరే ఛాన్స్ ఉంది. ఈ వారం ఎలాగూ కొత్త రిలీజులు లేవు కాబట్టి సెకండ్ వీకెండ్ ఖచ్చితంగా సమంతకు అనుకూలంగా మారుతుంది. చూస్తుంటే హీరోయిన్ బేస్డ్ మూవీస్ లో కొత్త రికార్డు సృష్టించడంలో డౌట్ పడనక్కర్లేదు.

This post was last modified on June 23, 2026 8:16 pm

Share

Recent Posts

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 minutes ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

20 minutes ago

40 సంవత్సరాల రాక్షసుడు…..ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

21 minutes ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

3 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

3 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

4 hours ago