కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత పాత క్లాసిక్స్ లో ఉంటాయి కాబట్టి. దానికో మంచి ఉదాహరణ చూద్దాం. 1986. చిరంజీవి అప్పటికింకా మెగాస్టార్ కాలేదు. సుప్రీమ్ హీరో బిరుదుతో దూసుకుపోతున్న టైం. యండమూరి రాసిన నవలని తెరకెక్కించే ఉద్దేశంతో నిర్మాత కెఎస్ రామారావు భారీ బడ్జెట్ తో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రాక్షసుడు నిర్మించారు. చిరు కెరీర్ లో ఇది మొదటి 70 ఎంఎం స్కోప్ మూవీ.
దీనికి కెజిఎఫ్ కనెక్షన్ ఏంటో చూద్దాం. రాక్షసుడులో మెయిన్ పాయింట్ ఏమిటంటే వంక చక్కరరామూర్తి అనే దుర్మార్గుడు ఎవరికి తెలియని ఒక పెద్ద అటవీ ప్రాంతంలో వేలాది మంది బానిసలుగా అక్కడో నేర సామ్రాజ్యాన్ని సృష్టించి వ్యాపారం చేస్తుంటాడు. హీరో అక్కడే పెరుగుతాడు. పెద్దయ్యాక తప్పించుకుని విలన్ ఆట కట్టించేందుకు పూనుకుని అక్కడికి తిరిగి చేరుకుంటాడు. అనాథగా పెరిగిన తనకు తల్లి ఉందని గుర్తించి ఆమె కోసం తపించి చివరికి కలుసుకుంటాడు.
కెజిఎఫ్, రాక్షసుడుకున్న ప్రధాన పోలికలు బానిసల గుంపు ప్లస్ మదర్ సెంటిమెంట్. ఈ రెండు విషయాలు చాలా దగ్గరగా ఉంటాయి. కథ ప్రకారం చిరంజీవి తన స్నేహితుడు, సహాయం చేసిన ఒక వృద్ధుడు. ప్రేమించిన ప్రియురాలిని పోగొట్టుకుంటాడు. రామ్మూర్తి రాజ్యంలోకి అడుగు పెట్టి మొత్తం నాశనం చేస్తాడు. కెజిఎఫ్ లో రాఖీ భాయ్ చేసేది కూడా ఇదే. దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు సందర్భాల్లో తన మీద చిరు ప్రభావం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.
నలభై సంవత్సరాల క్రితం అక్టోబర్ 2 భారీ అంచనాల మధ్య రాక్షసుడు విడుదలై మంచి విజయం సాధించింది. అదే రోజు కమల్ హాసన్ ఒక రాధా ఇద్దరు కృష్ణులు రిలీజ్ కావడం గమనార్హం. రెండు సినిమాలకు దర్శకుడు కోదండరామిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కావడం మరో ట్విస్టు. అలా మర్చిపోలేని జ్ఞాపకంగా మెగా ఫ్యాన్స్ గుర్తు చేసుకునే మూవీగా రాక్షసుడు నిలిచిపోయింది. అన్నట్టు ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు అసలు పేరే ఉండదు. ఆశ్చర్యం ఉన్నా ఇది నిజం.
This post was last modified on October 2, 2026 10:19 pm
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…