Political News

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా ఇచ్చిన తర్వాత కూడా దాన్ని రద్దు చేసే అధికారం అమెరికాకు ఉంటుంది. ఇప్పుడు అదే పెద్ద సంఖ్యలో జరుగుతోంది. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది.

ఇందులో విద్యార్థుల వీసాలు కూడా ఉన్నాయి. దాదాపు 8 వేల విద్యార్థి వీసాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, దాడులు, దొంగతనాలు వంటి కేసులతో పాటు ఇతర చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్న వారిపైనా చర్యలు తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది. దేశ భద్రతకు ముప్పుగా భావించిన సందర్భాల్లో కూడా వీసాను రద్దు చేసే అవకాశం ఉంటుంది.

అలాగే వీసా ఇచ్చే సమయంలోనే అన్ని తనిఖీలు పూర్తయ్యాయని అనుకోవడానికి లేదు. వీసా వచ్చిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తి వివరాలను అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారు. అమెరికా వీసాలు ఉన్న దాదాపు 5.5 కోట్ల మంది విదేశీయుల వివరాలను అవసరమైనప్పుడు మళ్ళీ పరిశీలిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ గతంలోనే తెలిపింది. కొత్తగా పోలీసు కేసు నమోదైందా, వీసా నిబంధనలు ఉల్లంఘించారా, భద్రతాపరమైన సమస్య ఏమైనా ఉందా అనే విషయాలను చూస్తారు.

అమెరికాలో బిడ్డకు జన్మనివ్వడం కోసమే కొందరు పర్యాటక వీసాపై వెళ్తుంటారు. ఇలాంటి వారిపైనా అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. వీసా తీసుకునే సమయంలో చెప్పిన వివరాలు తప్పని తర్వాత తేలినా, కొత్తగా అనర్హతకు సంబంధించిన సమాచారం బయటపడినా వీసా రద్దయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ 2.5 లక్షల మందిలో భారతీయులు ఎంతమంది అనే వివరాలను అమెరికా విడిగా వెల్లడించలేదు. ప్రస్తుతం బయటకు వచ్చిన లెక్క వివిధ దేశాలకు చెందిన వీసాదారులది.

This post was last modified on October 2, 2026 6:59 pm

Share

Recent Posts

బన్నీ ట్వీట్.. చిరుపై ట్రోలింగ్.. ఇదేం చిత్రం?

సోషల్ మీడియా జనాలకు ఫ్యాన్ వార్స్ చేయడానికి.. ట్రోల్స్ చేయడానికి పెద్ద కారణాలేమీ అక్కర్లేదు. దేన్నుంచయినా సరే.. ఒక పాయింటు…

8 minutes ago

కొత్త ట్రెండు… ఎవరి సినిమా వాళ్లు చూస్తున్నారు

కథ ఎక్కడ జరిగినా సరే, అందులో ఏ ప్రాంత భాష, యాస ఉన్నా సరే.. అన్ని ప్రాంతాల వాళ్లూ చూస్తేనే…

52 minutes ago

మంచినీళ్ల బాటిల్ తీసాడని చంపేసారా?

మంచి నీళ్ల బాటిల్ దొంగతనానికి ప్రయత్నించడమే అతడి నేరమైంది. పోనిలే పాపం.. ఎంత దాహం మీద వున్నాడో అని వదిలి…

4 hours ago

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

11 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

11 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

12 hours ago