కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే కెరీర్ చివరికి వచ్చేస్తారు. ఇది అన్ని భాషలకు వర్తిస్తుంది. తాజాగా కన్నడలో ‘ప్రేమద ఊరల్లి’ అనే చిన్న సినిమా సంచలన విజయం నమోదు చేస్తోంది. సెప్టెంబర్ 25 నానితో పాటే థియేటర్లలో అడుగు పెట్టింది. ట్విస్ట్ ఏంటంటే గత ఇరవై నాలుగు గంటల్లో ప్యారడైజ్ 38 వేల టికెట్లు అమ్మితే ప్రేమద ఊరల్లి ఏకంగా 80 వేల టికెట్లు అమ్మింది.
దీన్ని బట్టే ఏ స్థాయి విజయమో అర్థం చేసుకోవచ్చు. ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి ‘ప్రేమనే ఊరిలో’ టైటిల్ తో ఇవాళ విడుదల చేశారు. కనీస స్థాయిలో ప్రమోషన్లకు నోచుకోలేదు. అసలిది వస్తున్న సంగతే తెలియనంత వీక్ గా పబ్లిసిటీ చేశారు. కాంపిటీషన్ లో ఉన్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, సిగ్మా, తెల్లకాగితం, అనకాపల్లి ప్రచారాల దెబ్బకు ప్రేమనే ఊరిలోకి ఛాన్స్ లేకుండా పోయింది. హైదరాబాద్ లోనూ పరిమిత షోలతో రిలీజ్ చేయడం గమనార్హం.
అంతగా ఇందులో ఏముందంటే కథగా చూస్తే సింపుల్ అనిపిస్తుంది. నాగన్న (రంగయన రఘు) భార్య చనిపోయాక కొడుకు సంతు (శ్రీరామ్) ని కంటికి రెప్పలా పెంచుతుంటాడు. వ్యవసాయం మీద ఆధారపడ్డ ఆ కుటుంబంలో సంతు భార్య వచ్చాక పరిస్థితులు మారిపోతాయి. ఊళ్ళో జరిగిన కొన్ని సంఘటనలు, పరిస్థితులు నాగన్న, సంతు మధ్య విభేదాలు తీసుకొస్తాయి. వాటిని పరిష్కరించుకుని ఎలా ఒక్కటయ్యారనేది తెరమీద చూడాల్సిన అసలు స్టోరీ.
దర్శకుడు మనోజ్ కుమార్ ఎంచుకున్న స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేకపోయినప్పటికీ ఎమోషన్స్ ని ఆవిష్కరించిన విధానం, మనుషుల మధ్య సంబంధాలను చూపించిన తీరు, సునాద్ గౌతమ్ అందించిన చక్కని పాటలు, గ్రామీణ వాతావరణం, నటీనటుల పెర్ఫార్మన్స్ ఇవన్నీ ప్రేమద ఊరల్లిని మంచి మూవీగా మార్చేశాయి . తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేం. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా శాండల్ వుడ్ ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు.
This post was last modified on October 2, 2026 3:54 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…