Trends

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో బాలీవుడ్ డెబ్యూ చేసింది కానీ టైటిల్ కు తగ్గట్టే అది కూడా ఒక్క రోజు ఆడి థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది. అమీర్ ఖాన్ బ్యానర్ లో ఆయన కొడుకుతో నటించిన సంతృప్తి తప్ప ఇంకేం మిగల్లేదు. ఇంత గ్యాప్ రావడానికి కారణం రామాయణ. రెండు భాగాల ఈ విజువల్ గ్రాండియర్ కోసం ఫిదా భామ చాలా కాల్ షీట్లు ఇచ్చింది. పారితోషికం కూడా ఘనంగా ముట్టడం వేరే విషయం.

తన స్క్రీన్ దర్శనం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ కేవలం రెండు వారాల నిడివిలో సాయిపల్లవి రెండు రిలీజులు ఉండబోతున్నాయి. నవంబర్ 6 రామాయణ పార్ట్ వన్ రావడం దాదాపు ఖాయమే. ఓవర్సీస్ ఫిక్స్ అయ్యింది కానీ ఇండియా విడుదల తేదీ విషయంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రెండు రోజులు ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుందనే ప్రపోజల్ మీద ఇంకా డెసిషన్ తీసుకోలేదట. ప్రమోషన్లు ఆల్రెడీ మంచి స్వింగ్ లో ఉన్నాయి.

నవంబర్ 20 ధనుష్ నటించిన ఓమ్ రిలీజ్ కానుంది. ఇది కూడా పలు వాయిదాల తర్వాత మోక్షం దక్కించుకుంటోంది. ఇందులో సాయిపల్లవి మెయిన్ లీడ్ కాగా శ్రీలీలతో పాటు తెరమీద సందడి చేయనుంది. ఇందులో మమ్ముట్టి ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా దీపావళి అనుకుని ఫైనల్ గా ఈ రెండు పండగలు అయిపోయిన సీజన్ లో ఓమ్ వస్తోంది. కాకతాళీయంగా రామాయణ లాగా ఇది కూడా రెండు భాగాల సిరీస్ కావడం గమనించాల్సిన విషయం.

చూస్తుంటే రాబోయే రెండు నెలలు సాయిపల్లవి విరివిగా మీడియాకు అందుబాటులోకి రానుంది. ఇంత కరువు తీర్చేలా ఇవి హిట్టవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామాయణ, ఓమ్ రెండింటిలో సాయిపల్లవి చేసింది రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కాదు. పెర్ఫార్మన్స్ పరంగా చాలా ఛాలెంజ్ అనిపించేవి. క్లిక్ అయితే మటుకు తన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోవడం ఖాయం. ఇవి కాకుండా మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతితో చేస్తున్న ఇంజి వెల్లం వచ్చే ఏడాది రానుంది.

This post was last modified on October 2, 2026 10:20 pm

Share

Recent Posts

40 సంవత్సరాల రాక్షసుడు…..ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 minutes ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

3 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

3 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

4 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

5 hours ago