తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటోంది. కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగిన ఈ బ్యూటీ, చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండియాలో కొన్నాళ్లు చేసి, ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టడం ఆమె కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్.

డిస్నీ ఛానల్ ఒరిజినల్ మూవీ ‘స్పిన్’ లో లీడ్ రోల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన అవంతిక, ఆ తర్వాత ‘మీన్ గర్ల్స్’ లోని క్యారెక్టర్ తో ఇంటర్నేషనల్ వైడ్ గా భారీ బ్రేక్ అందుకుంది. రీసెంట్ గా ఈమె మిండీ కాలింగ్ క్రియేట్ చేసిన హులు సిరీస్ ‘నాట్ సూటబుల్ ఫర్ వర్క్’ తో డిస్నీల్యాండ్‌ లో సందడి చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఈ సిరీస్ లో ఆమె ‘అభినయ అబ్బి చిలుకూరి’ అనే స్టైలిస్ట్ క్యారెక్టర్ లో నటించగా అది స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో టాప్ స్పాట్ లో నిలిచింది.