తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

డిస్నీల్యాండ్‌ లో తన కో స్టార్స్ తో కలిసి దిగిన ఫోటోలలో అవంతిక వెస్ట్రన్ డ్రెస్ లో నొసట చిన్న బొట్టుతో కనిపించిన విధానం, ఆమె గ్లోబల్ లుక్ లోనూ తన రూట్స్ ను మర్చిపోలేదు అని చూపిస్తోంది. సాధారణంగా ఇండియన్ యాక్టర్స్ హాలీవుడ్ కి వెళ్లినప్పుడు అక్కడి స్టైల్ కి సింక్ అవ్వడానికి కొంచెం టైమ్ పడుతుంది, కానీ అవంతికా బోర్న్ అండ్ బ్రాట్ అప్ అక్కడే కావడం వల్ల వెస్ట్రన్ కల్చర్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆమెకు చాలా ఈజీగా సెట్ అయ్యాయి.

ఈ ఫోటో షూట్ లో కూడా స్ట్రాప్ లెస్ డ్రెస్ లో చాలా బోల్డ్ అండ్ క్లాసీ లుక్ తో అటెన్షన్ గ్రాబ్ చేసింది. ప్రస్తుతం అవంతిక హాలీవుడ్ లో కేవలం కామెడీ లేదా డ్రామా జోనర్లకే పరిమితం కాకుండా వైవిధ్యమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. ‘టారో’, ‘ప్రిటీ లీథల్’ లాంటి హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలతో తనలోని నటిని కొత్తగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌ల కెరీర్ ఒక స్టేజ్ తర్వాత క్లోజ్ అయిపోతుందనే అంచనాలను బ్రేక్ చేస్తూ, గ్లోబల్ లెవెల్లో తన మార్కెట్ బిల్డ్ చేసుకుంటున్న అవంతికా జర్నీ నిజంగా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ కి ఎగ్జాంపుల్.