భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఆ ప్రచారం కాస్త సైలెంట్ అయ్యింది అనుకునే లోపే ఇప్పుడు నెట్టింట మళ్లీ అదే టాపిక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి కారణం లేటెస్ట్ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ చేసిన కామెంట్స్.

రీసెంట్ గా లెనిన్ సినిమా ప్రమోషన్స్ కోసం భాగ్యశ్రీ, హీరో అఖిల్ కలిసి యాంకర్ సుమ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ చిట్ చాట్ లో భాగ్యశ్రీ ఒక చిన్న కామెంట్ చేయడంతో ఈ రూమర్స్ కు మళ్ళీ ప్రాణం పోసినట్లు అయింది. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. తన సొంతూరు ఔరంగాబాద్ అయినా హైదరాబాద్ తనకు సెకండ్ హోమ్ అని భాగ్యశ్రీ ఆ షోలో నవ్వుతూ చెప్పింది.

దీనికి యాంకర్ సుమ స్పందిస్తూ కంగ్రాట్స్ చెప్పి, చాలామంది ఇక్కడే సెటిల్ అవుతున్నారు మీరు కూడా అలానే అవ్వాలని కోరుకుంటున్నాం అని సరదాగా కౌంటర్ వేసింది. ఈ సింపుల్ డిస్కషన్ ఫ్యాన్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఎందుకంటే ఇటీవల రష్మిక విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఆమె కూడా ఇదే తరహాలో కామెంట్ చేశారు.

ఇక ఇప్పుడు భాగ్యశ్రీ చెప్పిన ఈ సెకండ్ హోమ్ కామెంట్ ను ఫ్యాన్స్ నేరుగా రామ్ పెళ్లి వార్తలతో ముడిపెడుతున్నారు. టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వడానికి రెడీ అవుతోందని, అందుకే ఇలా పరోక్షంగా హింట్స్ ఇస్తోందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వీళ్లిద్దరు పబ్లిక్ గా ఎక్కడ కనిపించినా జనాలు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా ఈ రూమర్స్ పై అటు రామ్ కానీ ఇటు భాగ్యశ్రీ కానీ ఎలాంటి రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేయలేదు. తామిద్దరం మంచి ప్రొఫెషనల్ బాండింగ్ షేర్ చేసుకుంటున్నామని గతంలోనే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి వీడియోలు దొరికినప్పుడల్లా ఈ లవ్ ట్రాక్ నిజమేనని బలంగా ఫిక్స్ అవుతున్నారు. అధికారికంగా ఎవరైనా స్పందిస్తే కానీ ఈ వార్తలకు ఎండ్ కార్డ్ పడేలా లేదు.