సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఔట్ స్పోకెన్ అని పేరున్న నాగవంశీ.. కొన్నిసార్లు సామాజిక మాధ్యమాలకు టార్గెట్ అవుతుంటాడు కూడా. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు ఫ్యాన్ డమ్స్ ఆయన్ని ట్రోల్ చేస్తుంటాయి. ఆ ట్రోల్స్ జరిగేటపుడు ఆయన పేరును నాగవంశీ అని కాకుండా చింటు అని సంబోధిస్తుంటారు.
ఐతే తనకీ పేరు పెట్టారని నాగవంశీ ఏమీ ఫీల్ కాడు. స్పోర్టివ్‌గానే తీసుకుంటుంటాడు. అందుకే రవితేజ, నాగార్జున లాంటి వాళ్లు కూడా స్టేజ్ మీద నాగవంశీని చింటు అని పిలుస్తూ ఆటపట్టించారు కూడా. ఇప్పుడు ఈ పేరు చెన్నైని కూడా తాకింది. నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ ఆడియో లాంచ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది.
ఆ ఈవెంట్లో నాగవంశీ తనదైన శైలిలో ఎంటర్టైనింగ్ స్పీచ్ ఇచ్చాడు. ఐతే ఆయన స్పీచ్ ఇవ్వడానికి ముందు యాంకర్ డీడీ.. తన ముద్దు పేరు చింటు గురించి అడిగింది. మీకీ పేరు ఎలా వచ్చింది అని ప్రశ్నించింది. దానికి నాగవంశీ బదులిస్తూ.. అది తనకు తెలుగు సినీ అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు అని బదులిచ్చాడు. తాను సోషల్ మీడియాలో కొంచెం రెబల్‌గా ఉంటానని.. తన కామెంట్ల వల్ల ఫ్యాన్స్ ఆ పేరుతో పిలుచుకుంటారని.. అందులో నెగెటివ్ ఏమీ లేదని, చిన్న పిల్లాడు అనే అర్థం వచ్చే పదం అదని అన్నాడు.
ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ గురించి నాగవంశీ చాలా ధీమాగా మాట్లాడాడు. తాను యారొగెంట్‌గా మాట్లాడట్లేదని, సినిమా మీద నమ్మకంతో చెబుతున్నానని.. విశ్వనాథ్ అండ్ సన్స్ తమిళ ప్రేక్షకులకు అలవైకుంఠపురం లాంటి సినిమా అవుతుందని అన్నాడు. ఇందులో గజినిలోని సంజయ్ రామస్వామిని సూర్య గుర్తు చేస్తాడని.. సూర్య అభిమానుల కోసమే రూపొందిన కథ ఇదని.. మామిత బైజు జెన్జీకి బాగా కనెక్ట్ అయ్యే నటి అని నాగవంశీ అన్నాడు.
#NagaVamsi:
— Gulte (@GulteOfficial) August 2, 2026
I'm a rebel on social media. Fans from various fandoms have nicknamed me ‘CHINTU.’#VishwanathAndSons pic.twitter.com/I92yutQ9xH
#NagaVamsi's Promise to #Suriya Fans:
— Gulte (@GulteOfficial) August 2, 2026
“We'll Bring Back Sanjay Ramaswamy…#VishwanathAndSons Will Be as Big in Tamil as #AlaVaikunthapurramuloo Was in Telugu.” pic.twitter.com/ljY4lkIFuc
Gulte Telugu Telugu Political and Movie News Updates
