రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరించే క్రమంలో బాక్సాఫీస్ దగ్గర వచ్చిన ఫలితాలు మాత్రం చాలా విభిన్నంగా ఉన్నాయి. వింటేజ్ కాలంలో ఎన్టీఆర్ లాంటి లెజెండ్స్ రామాయణ ఆధారిత సినిమాలతో సృష్టించిన బాక్సాఫీస్ మ్యాజిక్, ఫుట్ ఫాల్స్ ఆ తర్వాత మళ్లీ రిపీట్ కాలేదు. ఆధునిక కాలంలో ఆ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం పెద్ద సవాల్ గా మారింది.
ముఖ్యంగా ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో తడబడటంతో, ఇకపై ఈ రామాయణ కాన్సెప్ట్ ని ముట్టుకోవడానికి కూడా మేకర్స్ భయపడే పరిస్థితి వస్తుందేమో అనే చర్చ నడిచింది. ఊహించని టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, కథలోని ఆత్మను పట్టుకుని నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ చేయడం ఎంత కష్టమో ఆ సినిమా ప్రూవ్ చేసింది. కథ అందరికీ తెలిసిందే కాబట్టి, ఎక్కడ చిన్న తేడా వచ్చినా ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక నితీష్ తివారి రామాయణ కథను దాదాపు 4 వేల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ఎనౌన్స్ చేసినప్పుడు వచ్చిన హైప్ ట్రైలర్ తరువాత కనిపించడం లేదు. ప్రమోషనల్ కట్స్ కూడా అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయాయనే కామెంట్స్ వచ్చాయి. మరోవైపు ఎస్‌ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ లో జస్ట్ కుంభకర్ణుడు ఎపిసోడ్ ని మాత్రమే టచ్ చేస్తున్నారనే విషయం తెలిసిందే.
రాముడిగా మహేష్ కొద్ది నిమిషాలు కనిపిస్తారని ముందే తెలిసినా, రాజమౌళి మేకింగ్ స్టైల్ వల్ల ఆ ఎపిసోడ్ పై ఉండే అంచనాలే వేరుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అసలు రామాయణ కథపై ప్రేక్షకులలో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే టైమ్ ఆసన్నమైందా అనే ప్రశ్న ఎదురవుతోంది. అసలు ఈ కథను ఎలా తీస్తే థియేటర్లలో ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి అనే దానిపై ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో కొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది. కేవలం వందల కోట్ల గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హంగులు చూపిస్తే ఆడియన్స్ థియేటర్లకు వచ్చే కాలం పోయింది. ఎమోషన్ ని పక్కనబెట్టి కేవలం విజువల్స్ పైనే ఆధారపడితే ప్రేక్షకులు కనెక్ట్ కావడం లేదు.
ఈ తరం జనరేషన్ కి రామాయణాన్ని సరికొత్తగా రీచ్ చేయించాలంటే విజువల్ స్కేల్ తో పాటు క్యారెక్టర్లలోని డెప్త్, నటీనటుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఒకే ఏడాది వ్యవధిలో వస్తున్న ఈ విభిన్నమైన రామాయణ ఎపిసోడ్స్ ని, ఈ తరహా ప్రయత్నాలను నేటి తరం ఆడియన్స్ ఏ విధంగా ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
