సంక్రాంతి పండక్కి ముందు మామూలుగా థియేటర్ల వద్ద సందడి తక్కువగా వుంటుంది. ప్రీ ఫెస్టివల్ టైమ్ అంటూ ట్రేడ్ ఆ పీరియడ్ గురించి హెచ్చరిస్తూ వుంటుంది. అయితే పండక్కి వారం ముందు రిలీజ్ చేసి సక్సెస్ అయిన సినిమాలు చాలానే వున్నాయి. వారం ముందు రావడం వల్ల పండక్కి పాతబడిపోతుందనే రిస్క్ వున్నా కానీ ఈసారి రిలీజ్‍కి నాలుగైదు సినిమాలుండడం, అందులోను ఫిఫ్టీ పర్సెంట్ టికెట్లు మాత్రమే విక్రయించాలనే రూల్ వుండడంతో క్రాక్ సినిమాను జనవరి 9నే విడుదల చేసేస్తున్నారు.
శని, ఆదివారాలలో ఆడియన్స్ సినిమాలకు బాగా వస్తున్నారని సోలో బ్రతుకే సో బెటర్ విషయంలో రుజువయింది. దీంతో ఆ అడ్వాంటేజ్ పోగొట్టుకోకుండా ముందుగా వచ్చేస్తున్నారు. దీని వల్ల సంక్రాంతికి ఒక రోజు ఎడంతో విడుదలవుతోన్న సినిమాల నుంచి డైరెక్ట్ పోటీని తప్పించుకున్నట్టయింది.
క్రాక్ సినిమా అచ్చమైన మాస్ మసాలా మూవీ కావడంతో ఓటిటి రిలీజ్‍పై నిర్మాతలు మొదట్నుంచీ ఆసక్తి చూపించలేదు. ఈ సినిమాపై నమ్మకంతో కరోనా సమయంలో కూడా బయ్యర్లు వెనక్కు తగ్గలేదు. మాస్‍ని ఆకట్టుకుంటే కనుక నిఖార్సయిన సినిమా చూసి చాలా కాలం అవుతోంది కనుక ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడతారు. రిస్క్ ఫ్యాక్టర్ వున్నప్పటికీ ఇది సూపర్ ప్లాన్ అనే ట్రేడ్ పండితులు కూడా అంగీకరిస్తున్నారు.
This post was last modified on January 4, 2021 11:21 am
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…
తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…
తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టాలన్న స్పృహ రాను రాను తగ్గిపోతూ వస్తోంది. ఈ ఒరవడి తెలుగులోనే కాదు.. వేరే…
ఒకప్పుడు విదేశీ భాషలకు చెందిన సినిమాలను మన ఫిలిం మేకర్స్ యథేచ్ఛగా కాపీ కొట్టేసి సినిమాలు తీసేసేవారు. వాటి గురించి…
టాలీవుడ్ పవన్ స్టార్, ఏపీ డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మానవతావాది అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు…
భారత క్రికెట్ జట్టు మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు జట్టులో అనేక…