Movie News

సెట్ కి రాకుండా సినిమా తీసిన సింగీతం

దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని సాధ్యం చేసి చూపించింది. ఈ చిత్రానికి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అన్న సంగతి తెలిసిందే. కానీ 94 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యల దృష్ట్యా లొకేషన్ కు వచ్చి వందల మందిని కో ఆర్డినేట్ చేస్తూ సినిమా తీసే స్థితిలో లేరు. ఇటీవల ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ చక్రాల కుర్చీలో కనిపించరాయన. ఆ స్థితిలో ఆయన సినిమా ఎలా తీయగలిగారు అనే సందేహం అందరికీ కలిగింది.

అలా అని సినిమా అంతా నాగ్ అశ్విన్ అండ్ టీం తీసేసి సింగీతం పేరు వేయడం కూడా జరగలేదు. వీళ్లు పడే కష్టం వీరు పెద్దప్పటికీ సింగీతం దర్శకుడిగా తన వంతు బాధ్యత నిర్వర్తించారు. ఆయన చెన్నైలోని తన ఇంట్లోనే ఉంటూ ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేశారో స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

“నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి నేను దర్శకత్వం వహించాలని కోరారు. నాకు ఇప్పటికీ దర్శకత్వం వహించే ఉత్సాహం ఉంది. అయితే నా వయస్సు దృష్ట్యా సాంకేతిక సహకారంతో ఆన్‌లైన్‌లో సినిమా తెరకెక్కించే విధానాన్ని నాగ్ అశ్విన్ ఏర్పాటు చేశారు. నా హోమ్ థియేటర్‌లో కూర్చుని, షూటింగ్ లొకేషన్‌లో జరుగుతున్న ప్రతిదీ ప్రత్యక్షంగా చూస్తూ నటీనటులకు సూచనలు ఇచ్చేవాడిని.

అక్కడి కెమెరాలు, మానిటర్లు అన్నీ నాకు కనెక్ట్ అయ్యేవి. ఇంట్లో నుంచే మొత్తం సినిమాను దర్శకత్వం వహించాను. ఇది అద్భుతమైన మేనేజ్‌మెంట్. ఇలాంటి విధానాన్ని సాధ్యంచేసింది నాగ్ అశ్విన్ మాత్రమే” అని సింగీతం చెప్పారు. అంటే సింగీతం స్క్రిప్ట్ దగ్గర పెట్టుకుని ఆన్లైన్ ద్వారా సూచనలు ఇస్తుంటే నాగ్ అశ్విన్, సంకల్ప్ గోరా.. ఈ దిగ్గజ దర్శకుడి కలల ప్రాజెక్టుకు దృశ్యరూపం ఇచ్చారని అర్థం అవుతోంది. గత శుక్ర వారం రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందనే వస్తోంది.

This post was last modified on June 17, 2026 6:57 am

Share

Recent Posts

ర‌వితేజ‌కు పుత్రికోత్సాహం

స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మార‌డం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావ‌డం అరుదు. ఐతే సినీ…

45 minutes ago

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

4 hours ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

5 hours ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

7 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

7 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

8 hours ago