Movie News

‘లైగర్’ మరకలు చెరిగిపోతాయా?

విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటిదాకా అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా అంటే.. ‘లైగర్’యే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ చిత్రానికి అంతలా హైప్ రావడానికి సూపర్ స్టార్, మోస్ట్ కాంట్రవర్శల్ బాక్సర్ మైక్ టైసన్ అందులో ఓ కీలక పాత్ర చేయడం ఓ ముఖ్య కారణం. అసలు టైసన్‌ ఒక తెలుగు తెలుగు సినిమాలో నటించడం ఏంటి అని అందరూ అప్పుడు షాకైపోయారు.

కొన్ని నిమిషాల నిడివితో ఉండే పాత్ర కోసం అప్పట్లో ఆయనకు పాతిక కోట్ల పారితోషకం ఇచ్చింది టీం. కానీ టైౌసన్ క్యామియో సినిమాలో తుస్సుమంది. అప్పటికే ప్రేక్షకులకు చుక్కలు చూపించిన సినిమా.. ఆ పాత్ర వచ్చాక మరింతగా ప్రేక్షకులను ఫ్రస్టేట్ చేసింది. టైసన్ నటించడం బడ్జెట్ పెరిగింది తప్ప.. సినిమాకు పైసా ప్రయోజనం లేకపోయింది. మళ్లీ ఇలాంటి క్యామియోల గురించి మన ఫిలిం మేకర్స్ ఆలోచించాలంటే భయం కలిగే ఫలితాన్నందుకుంది ‘లైగర్’.

ఐతే ఇన్నేళ్ల తర్వాత విజయ్ సినిమాలో మళ్లీ ఒక హాలీవుడ్ లెజెండరీ నటుడిని చూడబోతున్నాం. అతనే.. ఆర్నాల్డ్ ఓస్లూ. విజయ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘ట్యాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్న ‘రణబాలి’లో ఆర్నాల్డ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. టైసన్‌లా అతనేమీ క్యామియో రోల్ చేయట్లేదు. స్వాతంత్ర్యానికి పూర్వం, బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్నాల్డ్.. సర్ థియాడోర్ హెక్టార్ అనే బ్రిటిష్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు.

దర్శకుడిగా రాహుల్ అభిరుచి ఏంటో తెలిసిందే కాబట్టి.. అతను ఆషామాషీగా ఆర్నాల్డ్‌ను ఈ పాత్ర కోసం తీసుకుని ఉండడు. కథకు అవసరం కాబట్టే ఆయన్ని ఎంచుకుని ఉంటాడు. కాబట్టి ‘లైగర్’లో టైసన్ పాత్రలాగా ఇది నవ్వుల పాలయ్యే క్యారెక్టర్ అయి ఉండదని.. ఆ మరకలను చెరిపివేసేలా ‘రణబాలి’లో ఆర్నాల్డ్ పాత్ర, ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటాయని ఆశించవచ్చు.

This post was last modified on June 17, 2026 2:33 pm

Share

Recent Posts

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

25 minutes ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

28 minutes ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

2 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

5 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

6 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

6 hours ago