జూలై 3 నాగబంధం విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ డెవిల్ తీసిన నిర్మాత కం దర్శకుడు అభిషేక్ నామా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్టు మీద వంద కోట్ల పెట్టుబడి జరిగిపోయింది. హీరో విరాట్ కర్ణ మొదటి చిత్రం పెదకాపు డిజాస్టర్ అయినప్పటికీ కథ ప్రకారం ఇతనైతే బాగుంటాడు, న్యాయం చేస్తాడనే నమ్మకంతో కంటెంట్ మీద ఇంత ఇంత ఖర్చు పెట్టారు. సత్యదేవ్ రావు బహద్దూర్ తో పోటీకి సిద్ధమవుతున్న నాగబంధం ప్రమోషన్లలో కొత్త ఎత్తుగడలు వేస్తోంది.
కథలో కీలక భాగమైన అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని సజీవ కళ ఉట్టిపడేలా తయారు చేసి హైదరాబాద్ తో మొదలు తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల పాటు ఇండియా వైడ్ ఒక పెద్ద ఆధ్యాత్మిక యాత్ర చేయబోతున్నారు. నిన్న గ్రాండ్ ఈవెంట్ ద్వారా భాగ్యనగరంలో శ్రీకారం చుట్టారు. గతంలో వచ్చిన టీజర్ మంచి అంచనాలు రేపగా ట్రైలర్ తో అవి మరింత పెరుగుతాయనే ధీమా టీమ్ లో ఉంది. నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడం దానికి నిదర్శనంగా చెబుతున్నారు.
హీరో ఇమేజ్ లేదనేది పక్కనపెడితే ఇలాంటి ఫాంటసీ కంటెంట్ వచ్చి చాలా రోజులయ్యింది. కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయి మేజిక్ రిపీట్ కాలేదు. కల్కి లాంటివి ప్యాన్ ఇండియా రేంజ్ లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ కౌంట్ చేయడం లేదు కానీ నాగబంధం పూర్తిగా విజువల్స్, కథాకథనాల మీద ఆధారపడి తీసింది. సరిగా కనెక్ట్ అయితే మన ఆడియన్స్ ఎవరు నటించారనేది పట్టించుకోరు. బాగుందనే టాక్ చాలు ఆటోమేటిక్ గా థియేటర్లకు వస్తారు.
నాగబంధంకి ఇంత పబ్లిసిటీ చేయడం అవసరమనే దానికి మరో కోణం కూడా ఉంది. రావు బహదూర్ ఒకటే కాదు జూలైలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. కేవలం వారం గ్యాప్ లో అఖిల్ లెనిన్ వస్తుంది. దీనికి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అటుపై వరసగా ఆనంద్ దేవరకొండ ఎపిక్, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ లాంటివి క్యూ కట్టి ఉన్నాయి. వీటికి తట్టుకోని నాగబంధం నిలబడాలి. థియేటర్ రెవిన్యూ సాలిడ్ గా రావాలి. అందుకే ప్రచారంలో రాజీపడే ఉద్దేశంలో లేరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
