Movie News

సింగీతానికి ప్రాణం పోసావయ్యా దేవి

భారతీయ సినిమాలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో 94 ఏళ్ల వయసులో ఫీచర్ ఫిలిం తీసి అబ్బురపరిచారు సింగీతం శ్రీనివాసరావు. ఎప్పుడో 40 ఏళ్ల కిందట వచ్చిన ఐడియాకు ఇప్పుడు దృశ్యరూపం ఇస్తూ ఆయన రూపొందించిన ‘సింగ్ గీతం’ శుక్రవారమే రిలీజై చక్కటి స్పందన తెచ్చుకుంటోంది. ఈ చిత్రానికి ఇటు రివ్యూలూ బాగున్నాయి. అటు మౌత్ టాక్ కూడా బాగుంది.

ఈ చిత్రం కోసం తెర వెనుక చాలామందే కష్టపడ్డారు. ‘35’ దర్శకుడు నందకిశోర్ ఈమానితో పాటు ఏకంగా అరడజను మంది రైటర్లు స్క్రిప్టు కోసం సింగీతంతో కలిసి కష్టపడితే.. మేకింగ్‌లో నాగ్ అశ్విన్, సంకల్ప్ గోర అన్నీ తామై వ్యవహరించారు. వైజయంతీ మూవీస్ రాజీ లేకుండా సినిమాను నిర్మించింది. సాంకేతికంగా ఇలా చాలామంది తమ వంతు పాత్ర పోషించినప్పటికీ.. సింగీతం కథకు ప్రాణం పోసింది మాత్రం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అనే చెప్పాలి.

పెద్ద పెద్ద హీరోలు, దర్శకులతో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసే దేవిశ్రీ ప్రసాద్.. తక్కువ బడ్జెట్లో, కొత్త వాళ్లతో తీసిన ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే సినిమా స్కేల్, స్టార్ క్రేజ్, డబ్బు.. ఇలాంటి విషయాలన్నీ పక్కన పెట్టి ఒక అభిరుచితో మనసు పెట్టి చేసే సినిమాలు ప్రతి టెక్నీషియన్‌కూ ప్రత్యేకమే. ‘సింగ్ గీతం’లో సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఉందో ప్రోమోలు చూస్తేనే అర్థమైపోయింది.

టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమా కాన్సెప్టే సంగీతంతో ముడిపడింది. ఈ చిత్రంలో మాటల కంటే పాటలు ఎక్కువ. పాత్రలు మాట్లాడుతుంటే అవే పాటలైపోతాయి. వాటన్నింటినీ లెక్కగడితే దేవిశ్రీ అన్నట్లు సినిమాలో 200 పాటలున్నట్లు లెక్క.తమ డైలాగులను పాత్రధారులు షూటింగ్ స్పాట్లో నోటికొచ్చినట్లు పాడేస్తే కుదరదు. స్టూడియోలో సింగర్స్‌తో పాటలు పాడించినట్లే.. ఆర్టిస్టులందరితోనూ పాటలు పాడించాల్సిన బాధ్యత సంగీత దర్శకుడిదే.

ఇందుకోసం దేవి ఎంత కష్టపడి ఉంటాడో.. ఎంత శ్రద్ధ పెట్టి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ‘జీవుడా జీవుడా’ సహా రెగ్యులర్ సాంగ్స్, బీజీఎం విషయంలోనూ దేవి అద్భుతమైన పనితనం చూపించాడు. అతను ఎంతో మనసుపెట్టి చేసిన సినిమా ఇదని ప్రతి ఫ్రేమ్‌లోనూ అర్థమవుతూనే ఉంటుంది.

రెగ్యులర్‌గా వినిపించే సౌండ్స్ అన్నీ పక్కన పెట్టి.. సరికొత్త సంగీతాన్ని అందించే ప్రయత్నం చేశాడు దేవి. నాగ్ అశ్విన్ లాగే సింగీతం‌ మీద గౌరవంతో ఆయన కెరీర్‌కు ఘనమైన ట్రిబ్యూట్ ఇవ్వాలనే సంకల్పంతో దేవి ఈ సినిమా చేశాడని అర్థమవుతుంది. అతను పెట్టిన ఎఫర్ట్‌కు ఎన్నో అవార్డులతో పాటు ప్రేక్షకుల నుంచి అమితమైన ప్రేమనూ అందుకుంటాడనడంలో సందేహం లేదు.

Kumar

Recent Posts

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

2 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

2 hours ago

సంయుక్త హాట్ మోడ్ అదిరింది

సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…

3 hours ago

నాగార్జున నోట‌… చింటు మాట‌

టాలీవుడ్ నిర్మాతల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీకి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంత‌మంది అత‌ణ్ని అభిమానిస్తే.. కొంత‌మంది త‌న‌ను అదే…

3 hours ago

చింతమనేని Vs పవన్… ఎలా ముగిసింది?

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…

3 hours ago

దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్

మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…

5 hours ago