Movie News

విజయ్ దేవరకొండ అంటే అంత ప్రేమ

దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత సెలెక్టివ్ గా ఉంటారో తెలిసిందే. కథలు, క్యాస్టింగ్, టీమ్, కంటెంట్ ఏదైనా సరే రాజీ లేకుండా తాను కోరుకున్నది చేసేంత వరకు రాజీ పడని మనస్తత్వం తనది. అలాంటి దర్శకుడికి సెంటిమెంటో అంతకు మించిన స్నేహమో ఏమో కానీ విజయ్ దేవరకొండని వదలకుండా తన ప్రతి వర్క్ లో కనిపించేలా చేయడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్న విడుదలైన ‘సింగ్ గీతం’లో కూడా రౌడీ బాయ్ చిన్న క్యామియో చేయడం విశేషం.

దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం వెనుక కారణం ఉంది. నాగ్ అశ్విన్ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో విజయ్ దేవరకొండకి ఎంత ప్రాధాన్యత దక్కిందో తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే నానినే ఓవర్ షాడో చేసే రేంజ్ లో ఆ పాత్ర పండింది. ఆ తర్వాత ‘మహానటి’లో జర్నలిస్టుగా కనిపించేది కేవలం కొన్ని నిమిషాలే అయినా నో అనకుండా చేశారు. ఇక ‘కల్కి 2898 ఏడి’లో ఇచ్చిన సర్ప్రైజ్ చిన్నదేం కాదు. చాలా ఇంపాక్ట్ ఇచ్చింది.

నాగ్ అశ్విన్ నిర్మాణ వ్యవహారాలు చూసుకున్న ‘జాతిరత్నాలు’లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇదంతా గమనిస్తే వీళ్ళ బాండింగ్ చాలా స్పెషల్ అనిపిస్తోంది. సింగ్ గీతం క్లైమాక్స్ ని తనతోనే ముగించిన తీరు చూస్తుంటే సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో ఒక్క సీన్ లో అయినా నటించాననే సంతృప్తి రౌడీ హీరోకి మిగిలింది. దీని వల్ల కమర్షియల్ స్కేల్ పెరిగినా పెరగకపోయినా మొదటి రోజు ఇది తెలియకుండా వెళ్లిన ఆడియన్స్ కి చివరిలో సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పొచ్చు.

కల్కి 2లో కూడా ఈ కాంబో ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఎక్కువ నిడివి ఉంటుందని నాగ్ అశ్విన్ గతంలోనే హింట్ ఇచ్చారు. అంటే ప్రభాస్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ని ఫుల్ లెన్త్ లో చూసే ఛాన్స్ దొరికితే అంతకన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది. కాకపోతే కథ పరంగా అది సాద్యమవుతుందో లేదో చూడాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇలా షేరింగ్ తరహాలో కాకుండా విజయ్ సోలో హీరోగా నాగ్ అశ్విన్ ఒక పూర్తి నిడివి సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరిక. ఎప్పటికి తీరేనో.

This post was last modified on June 13, 2026 12:37 pm

Share

Recent Posts

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

1 minute ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

3 minutes ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

41 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

2 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

3 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

3 hours ago