మామూలుగా స్టార్ హీరోయిన్లు హీరోలకు జోడీగా నటిస్తారు. లేదంటే తామే లీడ్ రోల్స్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తారు. అప్పుడప్పుడూ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలు కూడా చేస్తుంటారు. కానీ విలన్‌కు భార్యగా నటించడం మాత్రం అరుదే. ఐతే నయనతార ఈ సాహసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆమె మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో.. విలన్ భార్యగా కనిపించనుందట. చిరు త్వరలోనే మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే.
ఒరిజినల్లో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో నయనతారతో చేయించనున్నారట. తమిళంలో బాగా బిజీ అయిపోయిన నయన్ ఈ మధ్య తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేసినప్పటికీ.. ‘లూసిఫర్’ రీమేక్ చిరు చిత్రం కావడం, పైగా తనకు ‘తనీ ఒరువన్’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఇందులో నటించడానికి నయన్ ఒప్పుకుందట.
ఒరిజినల్లో మంజు వారియర్ పాత్ర హీరోకు జోడీగా ఉండదు. హీరోకు చెల్లెలి తరహా పాత్రలో కనిపిస్తుంది. హీరోతో ఆ పాత్రకు రక్త సంబంధం ఉండదు. కానీ ఆమె తండ్రి హీరోను దత్తపుత్రుడిగా భావిస్తాడు. ఈ రకంగా చూస్తే హీరో సోదరి పాత్రగా దాన్ని భావించవచ్చు. మరి ‘సైరా నరసింహారెడ్డి’లో చిరుకు భార్యగా నటించిన నయన్.. ఆయనకు సోదరి తరహా పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.
ఐతే నటనకు ప్రాధాన్యమున్న ఆ పాత్రకు నయనతార పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ పాత్రకు భర్తగా కనిపించే వ్యక్తే సినిమాలో మెయిన్ విలన్. చాలా పవర్ ఫుల్‌గా ఉండే ఆ క్యారెక్టర్‌ను ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ చేశాడు. మరి తెలుగులో ఆ పాత్రను ఎవరితో భర్తీ చేస్తారో.. నయనతారకు భర్తగా కనిపించే వ్యక్తి ఎవరో చూడాలి. నయన్‌కు జోడీగా అంటే స్టేచర్ ఉన్న నటుడినే ఈ పాత్రకు ఎంచుకునే అవకాశముంది. ఈ నెల చివర్లో లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates