తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
“సినిమాలో పవర్ స్టార్… రాజకీయాల్లో జనసేనాని. ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్న” అని లోకేష్ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్‌ను “పవనన్న”గా సంబోధిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రాజకీయాలకు అతీతంగా తమ మధ్య సోదరభావం, పరస్పర గౌరవం ఉందనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కూటమి శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లోకేష్‌కు అండగా నిలుస్తూ, సోదరుడిలా మద్దతు ఇస్తున్నారని అభిమానులు పేర్కొంటున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఒకే కుటుంబంలా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. కూటమిలో చిన్నచిన్న సమస్యలు రావడం సహజమేనని, అయితే వాటిని అందరూ కలిసి కూర్చొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత నాయకులందరిపైనా ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అన్న అంటూ ఆయనను కొనియాడారు.
This post was last modified on June 12, 2026 3:22 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…