యూత్ హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపు మీదున్నాడు. చెన్నై లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ కావడం తనకు మాములు ఆనందాన్ని ఇవ్వలేదు. మధ్యలో దిల్ రుబా అనే డిజాస్టర్ అందరూ మర్చిపోయారు కాబట్టి క, కె ర్యాంప్ తో కలిపి తనకు హ్యాట్రిక్ వచ్చిందన్న రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రతి సినిమా విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ హిట్స్ అందుకోవడంలో కిరణ్ కు కంటెంట్ తో పాటు అదృష్టమూ కలిసి వస్తోంది. త్వరలో దర్శకుడు కాబోతున్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న ఈ ఎంటర్ టైనర్ కు ‘రియాలిటీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.. దీని కన్నా మెరుగైంది తడితే మారుస్తారు లేదంటే ఇదే కొనసాగింపవుతుంది. ఇదిలా ఉండగా కిరణ్ అబ్బవరం త్వరలో ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీతో కొత్త అడుగులు వేయబోతున్నాడని సమాచారం. జీ స్టూడియోస్ నిర్మించే ఫాంటసీ చిత్రానికి ‘ఇంద్రపుత్ర’ టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి దర్శకుడు శ్రీకాంత్ పుప్పాల.
నిజానికి కిరణ్ అబ్బవరంకు సంబరాల ఏటిగట్టు తొలి ప్యాన్ ఇండియా మూవీ కావాల్సింది. నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్టు ఓకే చేసినప్పుడు హీరోగా అనుకున్నది తననే. కానీ మార్కెట్ కి మించి ఖర్చు పెడితే ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో అది కాస్తా సాయి దుర్గ తేజ్ కు వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ మెగా హీరో చేరినా ఇప్పటికీ అది వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పుడు మార్కెట్ అనుకూలంగా ఉండటంతో కిరణ్ ఫోకస్ ప్యాన్ ఇండియా మీదకు వెళ్తోంది.
ఇవే కాదు అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ‘గువ్వలచెరువు ఘాట్’ అనే వెబ్ సిరీస్ కూడా కిరణ్ ఖాతాలో ఉంది. సంయుక్త మీనన్, తిరువీర్ ఇతర తారాగణంగా రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ విడుదల తేదీ ఇంకా ఫిక్స్ చేయలేదు. కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా డైరెక్షన్, ఓటిటి అంటూ అన్నింటిలోనూ ఎంట్రీ ఇస్తున్న కిరణ్ రచయితగా ఆల్రెడీ ఎస్ఆర్ కల్యాణ మండపంతోనే ఋజువు చేసుకున్నాడు. సో మిగిలిన క్రాఫ్ట్స్ లో ఎలా నిరూపించుకుంటాడో చూడాలి.
This post was last modified on August 10, 2026 11:35 am
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…