ఎంత అగ్ర నిర్మాణ సంస్థ అయినా వరసగా కాకపోయినా కొంచెం గ్యాప్ తో అయినా హిట్లు పడుతూ ఉంటే ప్రొడక్షన్ కళకళలాడుతూ ఉంటుంది. ఇది వర్కౌట్ కావడం లేదని గుర్తించే సురేష్ బాబు ఈ వ్యవహారాన్ని బాగా తగ్గించుకుని ఎక్కువ పంపిణి వైపు మొగ్గు చూపుతున్నారు. యువి క్రియేషన్స్ గత కొంత కాలంగా బాక్సాఫీస్ ఫలితాలతో ఎదురీదుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత ఏడాది అనుష్క ఘాటీ డిజాస్టర్ కావడం తీవ్ర ప్రభావం చూపించింది .
ఈ సంవత్సరం ప్రారంభంలో కపుల్ ఫ్రెండ్లీకి ప్రశంసలు వచ్చాయి కానీ భారీ మొత్తంలో డబ్బులయితే కాదు. బడ్జెట్ తక్కువ కావడంతో రికవరీకి ఇబ్బంది కలగలేదు. అయితే శర్వానంద్ బైకర్ మాత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేదు. అందరూ టేకింగ్, యాక్టింగ్ గురించి పొగడ్తలు గుప్పించారు కానీ అవి కామన్ ఆడియన్స్ ని థియేటర్ల వైపు తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో కొరియన్ కనకరాజు మీద భారం వేసి యువి క్రియేషన్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసింది.
కట్ చేస్తే కొరియన్ కనకరాజు సూపర్ హిట్ స్టేటస్ దాటేసింది. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోవడం వరుణ్ తేజ్ కి పెద్ద ఊరట. రెండో వారాంతం వచ్చేలోపే లాభాలు మొదలైపోతాయి. ఫస్ట్ డే కంటే సండే కలెక్షన్లు ఎక్కువగా ఉండటం మంచి పరిణామం. యువికి ఇలాంటి విజయం చాలా అవసరం. ఎందుకంటే సాహో, రాధే శ్యామ్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇప్పుడీ బ్యానర్ వేరే స్థాయిలో ఉండేది. కానీ అలా జరగకపోవడం వేగాన్ని తగ్గించేసింది.
యువి చేతిలో నెక్స్ట్ విశ్వంభర ఉంది. విపరీతమైన జాప్యం వల్ల హైప్ మొత్తాన్ని సున్నా చేసుకున్న ఈ ఫాంటసీ డ్రామాకు తిరిగి పబ్లిసిటీ మొదలుపెట్టాలి. అక్టోబర్ 16 విడుదలనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది కానీ టీమ్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడం లేదు. ఒకవేళ అదే నిజమైన పక్షంలో ప్రమోషన్స్ గేరు పెంచాలి. కొరియన్ కనకరాజులాగా విశ్వంభర రీజనబుల్ బడ్జెట్ లో అవ్వలేదు. సో రికవరికి ఎక్కువ సమయం పడుతుంది. మరి యువి జోరుని అది కొనసాగిస్తుందో లేదో చూడాలి.
This post was last modified on August 10, 2026 10:03 am
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…