Movie News

వామిక టాలెంట్… మొత్తం తోడేశారు

సినిమా పరిశ్రమలో బ్రేక్ దక్కాలన్నా సక్సెస్ కొట్టాలన్నా టైం కలిసి రావాలి. కాకపోతే అది ఎప్పుడు వస్తుందో ఎవరు ఆ అవకాశాన్ని ఇస్తారో వచ్చే దాకా ఎదురు చూడాలి. వామికా గబ్బికి చాలా ఆలస్యంగా ఆ మలుపు దక్కింది. తాజాగా విడుదలైన డిసిలో వ్యభిచార గృహంలో మగ్గిపోయి, బయట ప్రపంచం తెలియని చీకటి జీవితాన్ని అనుభవించిన చంద్ర పాత్రలో వామికకు ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా సెకాండాఫ్ కొన్ని సీన్లలో లోకేష్ తో సహా ఇతర ఆర్టిస్టులను డామినేట్ చేసేసింది.

విచిత్రం ఏమిటంటే వామిక గబ్బి ఇండస్ట్రీకి వచ్చి 19 సంవత్సరాలు అయ్యింది. 2007 జబ్ వీ మెట్ మూవీలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టి క్రమంగా నటిగా స్థిరపడేందుకు చాలా కష్టపడింది. 2015 భలే మంచి రోజు ద్వారా సుధీర్ బాబు సరసన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం డీసెంట్ హిట్ కొట్టినప్పటికీ అమ్మడికి ఎక్కువ ఆఫర్లు రాలేదు. తమిళ మలయాళంలోనూ ట్రై చేసినా ఆశించిన స్థాయిలో బ్రేక్ త్రూ దొరకలేదు. అందుకే హిందీకే పరిమితమయ్యింది.

కౌంట్ పరంగా సినిమాలైతే ఉన్నాయి కాని గోప్ప ఫిల్మోగ్రఫీని వామిక సొంతం చేసుకోలేకపోయింది. విజయ్ తేరి హిందీ రీమేక్ బేబీ జాన్ లో నటిస్తున్నప్పుడు దాని నిర్మాత అట్లీ ద్వారా డిసి దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ కు కబురు వెళ్లడంతో లోకేష్ కనగరాజ్ సరసన ఆమెను జోడిగా ఎంపిక చేసుకున్నారని చెన్నై టాక్. ఆ మధ్య వచ్చిన అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాలో చేసిన డ్యూయల్ రోల్ వామిక గబ్బికి మంచి పేరే తీసుకొచ్చింది. థియేటర్లలో ఆడింది కూడా.

డిసిలో నటనకు వచ్చిన గుర్తింపు వామికని సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రస్తుతం ఆమె అడివి శేష్ గూఢచారి 2లో హీరోయిన్ గా నటిస్తోంది. దీని షూటింగ్ కీలక దశలో ఉంది. డిసి పుణ్యమాని కొంచెం లేట్ అయినా సరే కోరుకున్న గుర్తింపు దక్కడంతో వామిక ఇకపై సౌత్ నుంచి ఎక్కువ సినిమాలు వస్తాయని ఎదురు చూస్తోందట. వేసింది వేశ్య క్యారెక్టరే అయినా యాక్షన్ టచ్ ఉన్న ఇలాంటి పాత్రలు రావడం చాలా అరుదు. దాన్ని వామిక పరిపూర్ణంగా వాడుకుని సూపర్ హిట్లో భాగమయ్యింది.

This post was last modified on August 10, 2026 10:47 am

Share

Recent Posts

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

11 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

51 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

12 hours ago