కేవలం మూడే మూడు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగ. తన సినిమాలు యువతను ఎంతగా ఆకట్టుకుని, పిచ్చెక్కిపోయేలా చేశాయో, తనకు ఎలాంటి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తన సినిమాలే కాదు.. తన ఇంటర్వ్యూలు కూడా బ్లాక్ బస్టర్లే. అతనో చిన్న పోస్టు పెట్టినా చాలు.. అది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది.
తనకెంతో ఇష్టమైన నటుడు చిరంజీవికి సంబంధించి ఒక ఫ్రేమ్‌ను తన ఇంట్లో పెద్ద ఫ్రేమ్‌గా మార్చి పెట్టుకున్నాడు సందీప్. ఎవ్వరైనా సందీప్ ఇంటికి వెళ్తే దాని ముందు ఫొటో దిగడం ఆనవాయితీగా మారింది. ఈ ఫ్రేమ్ వెనుక స్టోరీ అంటూ కొన్ని రోజుల పాటు ‘ఆరాధన’ సినిమాలో చిరు ఇచ్చిన ఆ ఎక్స్‌ప్రెషన్‌కు సంబంధించిన సన్నివేశాన్ని వైరల్ చేశారు అభిమానులు. సందీప్ ఆలోచన తీరు ఎంత విలక్షణంగా ఉంటుందో, తన ఎఫెక్ట్ సోషల్ మీడియా మీద ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి అది రుజువుగా నిలిచింది.
అప్పుడు మెగా అభిమానులను ఒక ఊపు ఊపేసిన సందీప్ వంగ.. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుల అభిమానులను కూడా ఇలాగే వెర్రెత్తించేస్తున్నాడు. నిన్న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘కిరాయి కోటిగాడు’ సినిమాలో కృష్ణ నటించిన ఒక సన్నివేశాన్ని ఏఐ సాయంతో మహేష్ బాబుతో రీక్రియేట్ చేయిస్తూ విష్ చేశాడు సందీప్.
ఈ స్పెషల్ విషెస్ ఓవైపు మహేష్, సందీప్ కాంబినేషన్లో సినిమా గురించి చర్చకు దారి తీస్తే.. ఇంకోవైపు ‘కిరాయి కోటిగాడు’ సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్స్ వైరల్ అయ్యేలా చేశాయి. ఏంటీ సినిమా ప్రత్యేకత, ఈ క్యారెక్టర్లో విశిష్ఠత అని నేటి తరం అభిమానులు ఆ వీడియోలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ సినిమా చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
కృష్ణ ఫిల్మోగ్రఫీలో ఎన్నో బ్లాక్‌బస్టర్, స్పెసల్ చిత్రాలుండగా.. ఈ మూవీనే సందీప్ ఎంచుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో కృష్ణ యాటిట్యూడ్ మామూలుగా ఉండదు. రెబల్ రౌడీ పాత్రలో అప్పట్లో తన అభిమానులను ఉర్రూతలూగించాడు సూపర్ స్టార్. సందీప్ వంగకు ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్లంటేనే చాలా ఇష్టం. తన సినిమాల్లో పాత్రలు కూడా అలాగే ఉంటాయి మరి. రేప్పొద్దున మహేష్‌తో సందీప్ సినిమా చేసినా.. కిరాయి కోటిగాడు తరహా రెబల్ యాటిట్యూడ్‌తోనే హీరో పాత్ర ఉంటే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on August 10, 2026 2:31 pm
వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…
విజయనగరం జిల్లా రాజకీయాలు మొత్తం బొత్సా కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి. ప్రధానంగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో వారం రోజుల్లోనే బొత్సా…
ఇండియన్ సినిమాల్లో ఎంతో బోల్డ్‌గా నటించే కథానాయికల్లో రాధికా ఆప్టే ఒకరు. ఆమె కెరీర్ ఆరంభంలోనే కొన్ని చిత్రాల్లో న్యూడ్‌గా…
పెద్దల సామెత ఒకటి ఎప్పటికీ ఎవర్ గ్రీన్. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఊరికే చెప్పలేదు. ఇప్పటికీ ఎందరో దాన్ని పాటిస్తూనే…
గత కొన్నేళ్లలో తమిళం నుంచి వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘మహారాజ’ ఒకటి. నిథిలన్ స్వామినాథన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన…
తెలంగాణలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవిని కోల్పోయారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10 మేరకు ఆయన పదవిపై…