కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టేసింది. రీజనబుల్ బిజినెస్ చేయడం వల్ల మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేసి బయ్యర్లకు లాభాలిచ్చే పనిని మొదలుపెట్టేసింది. గత కొన్నేళ్లుగా వరుణ్ తేజ్ ట్రాక్ రికార్డు చూస్తే ఇంత ఓపెనింగ్, రెస్పాన్స్ రావడం అనూహ్యం. ప్రమోషన్లు కావొచ్చు, ఆమెచ్యురిష్ అంటూ చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీ కావొచ్చు, బజ్ పెరిగేందుకు ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి. దర్శకుడు మేర్లపాక గాంధీకి చాలా గ్యాప్ తర్వాత థియేటర్ సక్సెస్ దక్కింది.
అలాని ఇక్కడ పూర్తిగా సంబరపడేందుకు లేదు. ఎందుకంటే కళ్ళముందు వసూళ్లు కనిపిస్తున్నా లాంగ్ రన్ లో నిలబడేలా కొరియన్ కనకరాజు వీక్ డేస్ లో పెర్ఫార్మ్ చేస్తుందా లేదానే దాని మీద అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే కొరియన్ కనకరాజులో కొన్ని బలహీనతలున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పక్కనపెడితే తమన్ నుంచి పూర్తి స్థాయి ఛార్ట్ బస్టర్స్ పడలేదు. రాములో రాములా, సారొస్తారా లాంటి కనీసం ఒక్క వైరల్ సాంగ్ ఉన్నా రీచ్ మరింత ఎక్కువగా పెరిగేది.
ఇలాంటి దెయ్యాల కథల్లో లాజిక్స్ ఉండవు. నిజమే. అలాని క్వాలిటీ విషయంలో కాంప్రోమైజ్ కాకూడదు. క్లైమాక్స్ గురించి కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. విఎఫ్ఎక్స్ మెరుగ్గా ఉండాల్సిందనేది అధిక శాతం వ్యక్తం చేసిన అభిప్రాయం. టైం తక్కువగా ఉందని చెబితే సరిపోదు. ఇదేమి ప్యాన్ వరల్డ్ మూవీ కాదు. సరిపడా టైం అయితే దొరికింది. కానీ ఏవేవో కారణాల వల్ల కొంత రాజీ పడిన వైనం గ్రాఫిక్స్ తో పాటు ఇతర అంశాల్లో ఇంకాస్త కనిపించింది.
కొరియన్ ఎపిసోడ్ లోనూ వయొలెన్స్ మోతాదు ఎక్కువయ్యింది. సత్య టైమింగ్ ప్లస్ అయ్యింది కాబట్టి నవ్వులు పేలాయి కానీ ఒకవేళ తన స్థానంలో సప్తగిరి లాంటి వేరే ఆర్టిస్టుని పెట్టి ఈ స్థాయిలో కామెడీ వర్కౌట్ అయ్యేది కాదేమో. అంటే హీరోయిక్ ఎలిమెంట్ కొంత వీక్ అయినట్టే. అయినా వరుణ్ తేజ్ తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టడం కాపాడింది. ఏదైతేనేం సక్సెస్ వచ్చేసింది కాబట్టి మేర్లపాక గాంధీ ఇకపై మరింత ఫోకస్, గ్రిప్పింగ్ గా స్క్రిప్టులు రాసుకుంటే రావిపూడికి పోటీ ఇవ్వొచ్చేమో.
This post was last modified on August 10, 2026 10:22 am
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…