Movie News

లెజెండరీ దర్శకులు భారతీరాజా ఇక లేరు

ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు భారతీరాజా ఇవాళ చివరి శ్వాస వదిలారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. గత ఏడాది కొడుకు మనోజ్ హఠాత్తుగా కన్నుమూశాక తీవ్రంగా కలత చెందిన భారతీరాజాను, కొన్నేళ్లుగా ఉన్న అనారోగ్యం మరింత బాధ పెట్టింది. అప్పటి నుంచే చికిత్సలో ఉన్న ఈ విఖ్యాత దర్శకులు దాంతో పోరాడలేక శాశ్వత సెలవు తీసుకున్నారు.

1977 రజనీకాంత్ – కమల్ హాసన్ కలయికలో వచ్చిన ’16 వయతినిలే’ భారతీరాజా డెబ్యూ మూవీ. ఇది సంచలన విజయం సాధించింది. ఎంతగా అంటే రాఘవేంద్రరావు కోరి మరీ ‘పదహారేళ్ళ వయసు’గా రీమేక్ చేసేంత. స్టూడియోలలో ఎక్కువగా షూటింగులు జరిగే తమిళ సినిమాల సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ కెమెరాను స్వచ్ఛమైన పల్లెటూళ్లకు తీసుకెళ్లిన ఘనత భారతీరాజాకు దక్కుతుంది. 1978 ‘సిగప్పు రోజాక్కల్’ మరో సెన్సేషన్. తెలుగులో ‘ఎర్ర గులాబీలు’గా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ సాధించింది.

1981 ‘సీతాకోకచిలుక’ ఒక ట్రెండ్ సెట్టర్. కార్తీక్, అరుణ జంటగా వచ్చిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీలో ఇళయరాజా పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. జయం లాంటి ఎన్నో సినిమాలకు ఇది స్ఫూర్తిగా నిలిచింది. భారతీరాజా ప్రభావం ఎంతగా ఉండేదంటే 1988లో చిరంజీవి ఏరికోరి మరీ ‘ఆరాధన’ తీయించుకునేంత. కమర్షియల్ గా వర్కౌట్ కాదేమోననే అనుమానం ఉన్నా సరే దానికి సిద్ధపడే అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ రిస్క్ చేశారు. ఊహించినట్టే ఒరిజినల్ మేజిక్ ఇక్కడ రిపీట్ కాలేదు.

క్రైమ్ థ్రిలర్స్, రివెంజ్ డ్రామాలు తీయడంలో ఆయన శైలి వేరు. టిక్ టిక్ టిక్, ఖైదీ వేట లాంటివి కొన్ని మచ్చుతునకకు మాత్రమే. సూపర్ స్టార్ కృష్ణతో ‘జమదగ్ని’ తీశారు. మణిరత్నం ‘యువ’లో నటుడిగా భారతిరాజా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. చాలా సినిమాల్లో నటించారు. 2004 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో భారతీరాజాని గౌరవించింది. మంగమ్మ గారి మనవడు, పల్నాటి పౌరుషం లాంటి ఎన్నో హిట్ల అసలు కథకులు భారతీరాజానే. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఇండియన్ సినిమా మీద వేసిన ముద్ర ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది.

This post was last modified on June 10, 2026 9:03 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

55 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

2 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

4 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago