Movie News

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు వచ్చినవి గత అయిదేళ్ళలో ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పడం కష్టం. పెద్దికి సైతం ఈ ఇబ్బంది తప్పలేదు. ఇప్పుడీ లిస్టులోకి ది ప్యారడైజ్ చేరుతోంది. గతంలో ప్రకటించిన ఆగస్ట్ 21 రవితేజ ఇరుముడి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాని నిర్మాతలు పోస్ట్ పోన్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

తప్పుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు కానీ ది ప్యారడైజ్ బృందం ప్రస్తుతం ఒక నెల ఆలస్యంగా వచ్చే ఆప్షన్ల మీద కసరత్తు చేస్తోందని సమాచారం. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అక్టోబర్ లో బాలయ్య 111, ఆదర్శ కుటుంబం, నవంబర్ లో రామాయణ లాంటివి ఉన్నాయి కాబట్టి ఇదే బెస్ట్ ఛాయస్ అవుతుంది.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి కష్టపడుతున్నాడు కానీ ఫిలిం మేకింగ్ లో ఉన్న సంక్లిష్టత కారణంగా ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూనే ఉన్నాయట. నాని ఎంత సహకారం అందించినప్పటికీ కొన్ని ఎపిసోడ్లు ఎక్కువ వర్కింగ్ డేస్ డిమాండ్ చేస్తున్నాయి. దానికి అనుగుణంగా ఆర్టిస్టుల డేట్లు దొరకడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి.

అసలు సమస్య మరొకటి ఉంది. అనిరుధ్ రవిచందర్ నుంచి కాల్ షీట్స్ తీసుకోవడం సవాల్ గా మారిందని అంటున్నారు. తన నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ రాబట్టుకోవాలంటే తగినంత సమయం ఇవ్వాలి. ఆగస్ట్ అనుకుంటే అది కుదరని పని. అందులోనూ అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఆయా షేర్ ని మించిన పాటలు, బీజీఎమ్ పడాలి. రెండో సాంగ్ ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. చూస్తుంటే ఈ సస్పెన్స్ అంత త్వరగా తేలేలా కనిపించడం లేదు.

This post was last modified on June 9, 2026 5:12 pm

Share

Recent Posts

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

4 minutes ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

1 hour ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

2 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

2 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

2 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

3 hours ago