తన కెరీర్లో ఇంకే చిత్రానికీ పడనంత కష్టాన్ని ‘పెద్ది’ సినిమా కోసం పడ్డాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇందులో కుస్తీ యోధుడి పాత్ర కోసం చరణ్ తన దేహాన్ని ఎలా మార్చుకున్నాడో తెలిసిందే. తెరపై రెజ్లింగ్ సీన్లు చూసి అందరూ అవాక్కయిపోయారు. నిజంగా ఒక ప్రొఫెషనల్ రెజ్లర్‌ను చూస్తున్న భావనే కలిగింది ప్రేక్షకులు. తెలుగులో ఒక స్టార్ హీరో నుంచి ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్, పర్ఫెక్షన్ అరుదు.
ఐతే దీని వెనుక చాలా కష్టమే ఉంది. ఒళ్లు హూనమయ్యేలా కష్టపడిన చరణ్.. తన చేతిని దెబ్బ తీసుకున్నాడు. ‘పెద్ది’ ప్రమోషన్లలో కుడి చేతికి అతను బ్రేస్‌తో కనిపించిన సంగతి తెలిసిందే. షూట్ పూర్తయ్యాక స్కాన్స్ తీస్తే ఏకంగా 7 టియర్స్ ఉన్నట్లు చరణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రమోషన్లకు ఇబ్బంది రావద్దని అతను సర్జరీ చేయించుకోలేదు.
ఐతే ఈ సినిమా రిలీజైపోవడంతో చరణ్ అతి త్వరలో శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాడు. సర్జరీ అయ్యాక మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడట మెగా పవర్ స్టార్.
ఐతే ‘పెద్ది’ రిలీజవ్వగానే సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నాడు కానీ.. ఇప్పుడు సర్జరీ వల్ల అది ఆలస్యం కాబోతోంది. చరణ్ వెంటనే అందుబాటులోకి రావట్లేదని సుకుమార్ ఏమీ ఫీల్ కావట్లేదని సమాచారం.
మూడు నెలలు టైం కావాలని అడిగితే సంతోషంగా ఒప్పేసుకున్నాడట. కారణమేంటంటే.. చరణ్ సినిమాకు ఇంకా బౌండ్ స్క్రిప్టు రెడీ కాలేదు. ‘పుష్ప-2’ రిలీజై ఏడాదిన్నర కావస్తున్నా ఆయనకు టైం సరిపోలేదు. సుకుమార్ ఒక కథను ఓకే చేయడానికే చాలా టైం తీసుకుంటాడు. తర్వాత బౌండ్ స్క్రిప్టుకు కూడా చాలా టైం పడుతుంది. తన రైటింగ్ టీంతో కలిసి నెలల తరబడి కసరత్తు చేస్తాడు. చరణ్ సినిమాకు కథ ఓకే అయింది కానీ.. స్క్రీన్ ప్లే, డైలాగ్ వెర్షన్ రెడీ కాలేదు.
ఇప్పుడు పని మొదలుపెడితే మూణ్నాలుగు నెలలు టైం పడుతుంది.
కాబట్టి చరణ్ టైం కావాలంటే హ్యాపీగా సరే అనేశాడు సుకుమార్. తనకు సుక్కు టైం ఇచ్చినందుకు చరణ్ కూడా హ్యాపీనే. ఈ సినిమా కోసం పని చేస్తున్న టీం వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరికి గానీ ఈ సినిమా మొదలయ్యే అవకాశం లేదు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. రాయలసీమ-ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుందని సమాచారం. ఇంతకుముందు సుకుమార్, చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ చిత్రంపై ఉండే అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు.
This post was last modified on June 8, 2026 2:17 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…